నట సార్వభౌముడు, దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనను స్మరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపాయల కాయిన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నేడు ఈ కాయిన్స్ ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేసారు. ఈ ఫంక్షన్ రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు. రేపటి నుంచి ఈ కాయిన్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులతో సహా ప్రతి తెలుగువారి గుండె ఈ విషయమై సంతోషంగా స్పందిస్తోంది. తమ ప్రియతమ నటుడు, నాయకుడి ముద్రతో వచ్చే ఆ కాయిన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రపతి విడుదల చేసిన ఈ కాయిన్ ను రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మింట్ పత్రిక తెలిపింది. ఈ కాయిన్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుపుతూ మింట్ ప్రకటన విడుదల చేసింది.
Advertisement
Advertisement
ఆన్లైన్ లో కూడా ఈ కాయిన్ ను ఎలా తెప్పించుకోవచ్చో మింట్ ఛీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు వివరించారు. రేపు ఉదయం పది గంటల సమయం నుంచి ఈ కాయిన్ కొనుగోలు చేసుకోవడానికి అందుబాటులోకి రానుంది. మీకు ఈ కాయిన్ కావాలని అనుకుంటే మీరు మింట్ అధికారిక వెబ్ సైట్ లో కొనుక్కోవచ్చు. మీకు కావాలంటే, https://indiagovtmint.in/en/commemorative-coins/ లోకి వెళ్లి ఈ కాయిన్స్ ను కొనుక్కోండి. ఆఫ్ లైన్ లో కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న డిమాండ్, తయారీని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయిన్ ను మాత్రమే అమ్ముతారు. డిమాండ్ తగ్గిన తరువాత ఎన్ని కాయిన్స్ ను అయినా కొనుక్కునే అవకాశం ఉంటుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!
జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?