మీ వయసు ఆరుపదులు దాటాయా..? అయితే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండడం అవసరం. 60 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, కచ్చితంగా ఈ టిప్స్ ని పాటించాల్సిందే. 60 ఏళ్ల వయసులో బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. చెడు కొలెస్ట్రాల్ ని కరిగించేసి గుండె సమస్యల్ని రాకుండా ఓట్స్ చేయగలవు. గ్రీన్ టీ ని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది 60 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు టీ, కాఫీలు తీసుకోవడం మానేసి గ్రీన్ టీ ని అలవాటు చేసుకుంటే ఉల్లాసంగా ఉంటారు. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీస్ ని తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి.
వెల్లుల్లి ని రోజువారి ఆహార పదార్థాలలో తీసుకుంటూ ఉండండి. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది కాబట్టి ప్రతిరోజు వెల్లుల్లిని తీసుకునేలా చూడండి. అవకాడో తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు రక్తపోటుని అదుపులో ఉంచడానికి అవకాడో బాగా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. టమాటాలను తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని టమాటాలు పెంచుతాయి తృణధాన్యాలను డైట్ లో తీసుకోండి. తృణధాన్యాలలో ఫైబర్ విటమిన్స్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యంతో పాటుగా క్యాన్సర్ కూడా రాకుండా చూస్తాయి.
Also read:
- అతిగా చెమట పడుతోందా..? అయితే ఇలా మీరు తగ్గించుకోవచ్చు…!
- చాణక్య నీతి: కష్ట సమయంలో వీటిని తప్పక ఆచరించండి…!
- చంద్రబాబు నాయుడు హెల్త్ డేంజర్ లో ఉందా? స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర జరుగుతోందా?