కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ కాంత్ ఒకరు. తన సన్నిహితులు, అభిమానులకే కాకుండా ఎంతోమంది తెలియని వారికి కూడా సాయం చేశారు. విజయ్ కాంత్ తండ్రి అళగరస్వామికి ఆండాళ్, రుక్మణి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. విజయ్ కాంత్ ఆండాళ్ అమ్మాళ్ కుమారుడు. విజయ్ కాంత్‌తో విజయలక్ష్మి, నాగరాజన్, తిరుమలదేవి జన్మించారు. విజయ్ కాంత్ తండ్రి రెండో భార్య రుక్మిణి అమ్మాళ్కు సెల్వరాజ్, బాల్‌రాజ్, చిత్రాదేవి, రామరాజ్, మీనాకుమారి, శాంతి, పృథ్వీరాజ్ అనే 7 మంది సంతానం కలరు.
Advertisement
సినిమాల్లో మంచి గుర్తింపుతో పాటు ఆయన నటించిన సినిమాలు సూపర్ విజయం సాధించడంతో వాటితో డబ్బు సంపాదించిన విజయ్ కాంత్ ఆయన సవతి తల్లి పిల్లలకు అండగా నిలిచి అందరికి ఎన్నో సహాయాలు చేశారు. అన్నదమ్ములందరికి విజయ్ కాంత్ వివాహాలను ఘనంగా జరిపించాడు. తమ్ముళ్ల వివాహాన్ని విజయ్ కాంత్ నిర్వహించారు. సినిమా కథలో మాదిరిగానే తన అన్నదమ్ములందరికీ పెళ్లిళ్లు చేసి అతని బాధ్యత పూర్తి చేసే నాటికి విజయ్ కాంత్ వయసు 37 ఏళ్లు. అప్పుడే కుటుంబ సభ్యుల ఒత్తిడితో ప్రేమలతను పెళ్లి చేసుకున్నాడు.
తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బీఏ పట్టభద్రురాలు ప్రేమలత అప్పటికే స్టార్ హీరో అయిన విజయ్ కాంత్‌కు వీరాభిమాని. విజయ్ కాంత్ కు 37 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ప్రేమలత ఆయన చేయి పట్టుకున్నారు. విజయ్ కాంత్ 1990 జనవరి 31వ తేదీన ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు. అప్పటికి అతని వయసు 37 సంవత్సరాలు. విజయకాంత్-ప్రేమలత వివాహమై 33 ఏళ్లు పూర్తయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధి అంటే విజయకాంత్‌కు చాలా ఇష్టం. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ అంటే విజయకాంత్ కు కూడా ఇష్టం. విజయకాంత్ పెళ్లిని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నిర్వహించారు. విజయకాంత్‌కు వివాహ శుభాకాంక్షలు తెలిపిన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నా సోదరుడు విజయ్ కాంత్ సినిమా రంగంలో ఉన్నతస్థాయికి చేరినా ఆయనకు నియంత్రణ కలిగి ఉంటారని.. కళారంగంలో ఉన్నతస్థాయికి వెళ్లినా అహంకారం దరిచేరకుండా చూసుకుంటారన్నారని కరుణానిధి విజయ్ కాంత్ పెళ్లి రోజు కితాబు ఇచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలను వదిలేసిన విజయ్ కాంత్ అనంత లోకాలకు వెళ్లిపోయారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!