సాధారణంగా మనకు నీటిలో ఉండే నాచు గురించి తెలుసు. ఆ నాచును చేపలు, పలు జంతువులు తింటుంటాయి. కానీ మానవులు తినడం ఏంటి అనే డౌట్ రావచ్చు.. భారత్ లో అయితే ఇప్పుడిప్పుడు ఈ నాచు గురించి తెలుస్తుంది. కానీ నార్త్ కొరియా, సౌత్ కొరియా, చైనా వంటి దేశాల్లో ఈ నాచును సూషి లో యూజ్ చేసి తింటారు. హెల్త్ కోసం తింటారు. దీని పేరు స్పైరులనా. ఇది సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క. ప్రస్తుతం వీటికి చాలా డిమాండ్ ఉంది. ఈ నాచు లో కాపర్, ఐరన్ , ఓమేగా 6, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, ఫైకోసైనిన్, థయామిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది ప్రతి రోజూ ఒక స్పూన్ తింటే.. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
Advertisement
Advertisement
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో స్పైరులినా ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ ఒక గ్రాము స్పైరులినా తీసుకుంటే.. చెడు కొలస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. స్పైరులినాలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తెల్లరక్తకణాలు వృధ్ధి చెందుతాయి. శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ కణితుల పరిమాణం తగ్గించడంలో స్పైరులినా మంచి ప్రభావం చూపించిందన్నారు. క్యాన్సర్ పేషెంట్స్ ఈ నాచును తిన్నట్లయితే వారిని కీమో వరకు వెళ్లకుండా కాపాడవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!