నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే దొర్లే టాపిక్స్ లో సినిమాల తరువాత క్రికెట్ ఉంటుంది. ఇండియా లో క్రికెట్ అభిమానులు కూడా ఎక్కువే. క్రికెట్ ఆడడాన్నే కాదు.. చూడడాన్ని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. క్రికెట్ గురించి ప్రతి విషయాన్నీ తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఆర్టికల్ లో ప్రపంచదేశాలతో అత్యంత బరువైన క్రికెట్ బ్యాట్ ఎవరికీ ఉందో తెలుసుకుందాం. టాప్ ఐదుగురి లిస్ట్ తీస్తే.. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లే ఉండడం విశేషం.
Advertisement
క్రికెట్ లో ప్రతి పరుగు విలువైనదే. ఒక్క పరుగు తేడాతో ఎన్ని మ్యాచ్ లు ఓడిపోవాల్సి వచ్చిందో లెక్క లేదు. క్రికెట్ గ్రౌండ్ లో పరుగులు తీయాలన్నా, ఫోర్లు, సిక్స్ లు కొట్టాలన్నా ఆటగాడి చేతిలో బ్యాట్ అనువుగా ఉండాలి. అయితే.. ఎక్కువ బరువు వాడే టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 100 సెంచరీలను కొట్టిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ అత్యంత బరువైన క్రికెట్ బ్యాట్ ను వాడిన ఆటగాడిగా చరిత్రలో నిలిచారు. సచిన్ టెండూల్కర్ ఒకసారి MRF-Adidas కంపెనీకి చెందిన 1.47 కిలోల బ్యాట్‌ను వాడారు.
Advertisement
ఈ లిస్ట్ లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన Spartan CG కంపెనీకి చెందిన 1.36 కిలోల బ్యాట్‌ని వాడారు. టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 1.35 కిలోల SG బ్యాట్ వాడారు. ఈ బ్యాట్ తో ఆయన 2008లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేసారు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని 1.27 కిలోల బరువు ఉన్న Spartan బ్యాట్‌ను వాడారు. తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయిన డేవిడ్ వార్నర్ మామ 1.24 కిలోల బరువు ఉన్న బ్యాట్ ను వాడారు.
మరిన్ని..
వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !