Home » సినిమాల్లో న‌టిస్తూనే వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లు వీళ్లే..!

సినిమాల్లో న‌టిస్తూనే వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లు వీళ్లే..!

by AJAY
Ad

సినిమా తారలు కేవలం సినిమాలు చేయడం ద్వారా సంపాదించడం మాత్రమే కాకుండా ఇతర మార్గాలలోను డబ్బులు సంపాదిస్తుంటారు. ఎక్కువ‌గా తార‌లు వ్యాపారాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే మ‌న‌ స్టార్ హీరోయిన్ లు చాలా మంది వ్యాపారాలతో ఫుల్ గా సంపాదిస్తున్నారు. అలా వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Rakhulpreet singh

Rakhulpreet singh

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం ఆఫర్ లు తగ్గినట్టు కనిపిస్తోంది. అడపా దడపా సినిమాల్లో మాత్రమే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ సినిమాలతో పాటు ఫిట్నెస్ రంగంలో కూడా రాణిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు ముంబై.. హైదరాబాద్ లాంటి సిటీలలో ఫిట్నెస్ స్టూడియోలు ఉన్నాయి..


మిల్కీ బ్యూటీ తమన్నా సైతం వ్యాపారం చేస్తుంది. తమన్నా జ్యువెలరీ డిజైనర్ వ్యాపారం చేస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ సమంత ఓవైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యాపారాల ద్వారా సైతం డ‌బ్బులు సంపాదిస్తోంది.

Advertisement

Samantha

Samantha

చాలా కాలం క్రితం సామ్ స‌ఖి పేరుతో గార్మెంట్ బ్రాండ్ ను ప్రారంభించింది. సమంతా లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

alia bhatt

alia bhatt

అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ అలియా భట్ సైతం గార్మెంట్ రంగంలో రాణిస్తోంది. అలియా భట్ మహిళల కోసం అందమైన సౌకర్యవంతమైన డిజైన్స్ ను రూపొందించి ఆ వ్యాపారంలో అడుగుపెట్టింది.

ఇదిలా ఉంటే చందమామ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి ఫర్నిచర్ బిజినెస్ ను ప్రారంభించింది. అంతేకాకుండా అత్తారింటికి దారేది సినిమా బ్యూటీ ప్రణీత హోటల్ రంగంలో రాణిస్తోంది. బెంగళూరులో ప్రణీత ఓ స్టార్ హోటల్ ను ప్రారంభించింది. వీళ్లు మాత్ర‌మే కాకుండా టాలీవుడ్ హీరోయిన్ లు తాప్సి, శ్రీయ‌ సైతం వ్యాపారాలు చేస్తున్నారు.

ALSO READ :అప‌రిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమ‌నించారా..?

Visitors Are Also Reading