గత కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోయిన్ త్రిష పేరు సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. నార్త్ స్టేట్స్ లో కూడా మార్మోగిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే. దాన్ని సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అందుకు మన్సూర్ తాను నీచంగా మాట్లాడినా.. క్షమాపణలు చెప్పను అని స్టేట్మెంట్ ఇవ్వడంతో దాదాపు పది రోజుల పాటు త్రిష మన్సూర్ టాపిక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఫైనల్ గా మన్సూర్ క్షమాపణలు చెప్పడం.. త్రిష దాన్ని అంగీకరించి క్షమించడంతో వివాదం ముగిసిపోయింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా త్రిష చేసిన పనికి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే? రీసెంట్ గా త్రిష తన ఇన్ స్టాగ్రామ్ లో యానిమల్ సినిమాను తాను చూశానని.. అదో అద్భుతమైన మూవీ అన్నట్టు ఓ స్టోరీ పెట్టింది. సినిమా గురించి ఒక వర్డ్ లో అది ఓ కల్ట్ మూవీ అంటూ యానిమల్ మూవీ టీమ్ ని అభినందించింది. అంతే కాదు.. ppaaaaahhh అంటూ ఓ కామెంట్ కూడా చేసి రెండు, మూడు స్మైలీ ఇమేజీలను కూడా జోడించింది.
Advertisement
అయితే ఈ స్టోరీని త్రిష ఎక్కువ టైం ఉంచలేదు. కొద్ది నిమిషాల్లోనే ఈ స్టోరీని డిలీట్ చేసేసింది. ఇదే ప్రస్తుతానికి నేటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. నిజానికి యానిమల్ సినిమా ఒక కల్ట్ మూవీ. సినిమాలో ప్రతి బంధం మధ్య డైరెక్టర్ చూపించిన ఎమోషనల్ సీన్స్ ప్రతి ఆడియన్ ని కట్టిపడేస్తాయి. ఇద్దరి రిలేషన్స్ మధ్య వచ్చిన డైలాగ్స్ రాయడం ఒక సందీప్ రెడ్డి వంగా కే సాధ్యం అవుతాయని యానిమల్ తో తెలిసిపోతుంది. ఈ క్రమంలో కొన్ని ఏ సర్టిఫికెట్ డైలాగ్స్ వాడారు. అలాగే కొంత రొమాన్స్ ని కూడా ఎక్కువ చూపించాడు. ఈ రెండు పక్కన పెట్టి సినిమా మొత్తం గురించి ఆలోచిస్తే.. యానిమల్ ఓ మంచి కంటెంట్ ఉన్న అసలైన సినిమా.
Advertisement
దీన్ని ఒప్పుకోవాల్సిందే. త్రిష కూడా ఒప్పుకుంది. అదే తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీగా పెట్టుకుంది. కానీ మళ్ళీ వెంటనే ఎందుకు డిలీట్ చేసింది. యానిమల్ లాంటి మూవీకి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతే కెరీర్ పోతుందని భయపడిందా? ఈ స్టోరీ వైరల్ అయితే.. తనకు నెగిటివిటీ వస్తుందని అనుకున్నదా? అంటే అవుననే అంటున్నారు నేటిజన్లు. అయితే ఓ సినిమాపై స్టాండ్ తీసుకున్న తర్వాత.. మళ్లీ వెంటనే దాన్ని మార్చుకొని స్టోరీ డిలీట్ చేయడం పై యానిమల్ సినిమాకు ఫిదా అయిపోయిన ఆడియన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!