Home » రజినీకాంత్ గురించి హీరోయిన్ రంభ షాకింగ్ కామెంట్స్..!

రజినీకాంత్ గురించి హీరోయిన్ రంభ షాకింగ్ కామెంట్స్..!

by Anji
Published: Last Updated on
Ad

హీరోయిన్ రంభ ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ, ఆ తరం ప్రేక్షకులు హీరోయిన్ రంభను ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకప్పుడు చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రంభ. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడంతో పాటు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రంభ. సౌత్ స్క్రీన్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపింది రంభ. 1990 లలో అగ్ర కథానాయకగా వెలుగొందిన ఆమె 1996లో సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఉనుతై అల్లిత్త సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కార్తీక్ కి జంటగా రంభ నటించింది.

Advertisement

ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది. అయితే తమిళ్ లో తనకు మంచి కెరీర్ ను అందించిన సుందర్ సి డైరెక్షన్ లో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అరుణాచలం సినిమాలో రజనీకాంత్ పిఏగా నందిని పాత్రను రంభ పోషించింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో రజనీకాంత్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటి రంభ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ రంభ మాట్లాడుతూ.. అరుణాచలం సినిమాలో నటిస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ తో బంధన్ అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటించాను. అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అందుకే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్ షూటింగ్ చేశాను.

Advertisement

ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు బంధన్ షూటింగ్ స్పాట్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ లు రజనీకాంత్ ని చూసేందుకు అరుణాచలం సినిమా సెట్ కి వచ్చారు. వాళ్లను చూడగానే మా హీరో వచ్చాడు అన్నట్టుగా నేను ఎక్కడ ఉన్నాను అన్నది మర్చిపోయి వెంటనే సల్మాన్ ను కౌగిలించుకొని పలకరించాను. తర్వాత రజినీ సార్ ఇదంతా దూరం నుంచి చూస్తున్నారు. తర్వాత రజిని సార్, సుందర్ సి అందరూ వారితో మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది. సెట్ లో గందరగోళం నెలకొంది. రజనీకాంత్ సార్ టవల్ విసిరికొట్టి ఆగ్రహంతో మాట్లాడారు. సుందర్ సి నా వైపు చూశారు. నాకేమీ అర్థం కావడం లేదు. అప్పుడు కెమెరామెన్ వచ్చి ఏం మేడం ఇలా చేశావు. ఇకపై మీతో నటించను అని రజినీ సార్ అంటున్నారు అని అన్నారు.

దీంతో నేను బోరున ఏడవసాగాను. వెంటనే నేను ఏడ్చడం చూసి రజినీ సార్ భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఓదార్చారు. ఆమెను ఎందుకు ఏడిపించావు అని పక్కన వారిని కోప్పడ్డారు. తర్వాత షూటింగ్ స్పాట్ లో ఉన్న వారందరినీ పిలిచి నిలుచోబెట్టి మరీ చెప్పారు. ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ ఎలా పారిపోయి కౌగిలించుకుందో ప్రాక్టికల్ గా ఆయన చేయించి చూపించారు. అదే మా సినిమా సెట్ లో అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్లిపోతానని చెప్పి వాళ్ళ సినిమా హీరో అయితే ఇలా కౌగిలించుకొని మరి చెబుతారు. హిందీ నటుడు అయితేనే వెళ్లి కౌగిలించుకుంటావా అని సరదాగా నన్ను ఏడిపించారు అని రంభ ఆనాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

Visitors Are Also Reading