నటన పరంగా సావిత్రి ఎంతో పేరు సంపాదించుకున్నా కానీ నిజ జీవితంలో మాత్రం చాలా దారుణంగా సమస్యలు ఎదుర్కొని నా అన్న వాళ్ళు పక్కన లేకుండానే మరణించింది. మరి ఇలాంటి సావిత్రి చివరి సమయంలో జరిగిన కొన్ని విషయాలు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బయటపెట్టింది.
Advertisement
తనకు చిన్న వయసులోనే పెళ్లి చేశారని తన వివాహానికి రెండు సంవత్సరాల ముందే సావిత్రి జెమిని గణేషన్ మధ్య విభేదాలు మొదలయ్యాయని చాముండేశ్వరి అన్నారు. వారిద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయో ఆ సమయంలో నాకు అర్థం కాలేదని, వారు ఎంత గొడవ పడ్డ నాతో ప్రేమగా ఉండేవారు అని చెప్పుకొచ్చింది. అమ్మ నాన్న మధ్య గొడవ ప్రభావం తనపై పడలేదు కానీ, తమ్ముడు పై ఆ ప్రభావం బాగా పడిందని ఆమె తెలియజేశారు. నా తల్లి చాలా అమాయకురాలని ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో తెలియక, ఆ సమయంలో ఆమెకు సరైన సలహాలు ఇచ్చే వారు కూడా లేక మరింత దిగజారి పోయిందని, ఒక సమస్య ఉండగా మరో సమస్య తెచ్చుకున్నదని తెలిపింది. ఆమె అమాయకత్వం వల్ల చాలా నష్టపోయిందని, సమస్యలు చుట్టుముట్టడంతో మద్యానికి బానిసై, ఆ ఒత్తిడి లోనే 19 నెలలు కోమాలోకి వెళ్లి , నరకయాతన అనుభవించారు అని తెలిపారు. కానీ అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందిని అనుకున్నాం. కానీ మా ఆశలపై నీళ్లు చల్లి ఆమె చివరికి కన్నుమూశారు.
also read:అశ్విన్ సమయస్ఫూర్తికి ఫిదా అయిన కోహ్లీ..!
Advertisement
అమ్మ తో విభేదాలు ఉన్నప్పటికీ అమ్మను బెడ్ మీద చూసి నేను చలించిపోయానని విజయ చాముండేశ్వరి అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే అమ్మ నాన్నతో విడిపోయిన తర్వాత ఆ బాధను తన గుండెల్లో దాచుకొని కుమిలి పోయిందని, అంతే కాకుండా ఆమెకు ఉన్న థైరాయిడ్, షుగర్ వ్యాధి మద్యానికి బానిసవడం వల్ల అవి తీవ్రమై పోయాయని దీంతో కోమా లోకి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆమె వెంట ఉన్నది తమ్ముడు మాత్రమే అని బాధను వ్యక్తం చేసింది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె ఒంట్లో ఎముకలు మాత్రమే కనిపించేవి, ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆ బాధను తట్టుకోలేక జెమినీ గణేషన్ ను తీవ్రంగా తిట్టుకున్నారని తెలుస్తోంది.
అలాంటి ఆమె స్థితిని తెలుసుకున్న దాసరి నారాయణరావు ఉదయం వెళ్లి చూద్దామని అనుకున్నారట, కానీ అంతలోపే సావిత్రి మరణ వార్త బయటకు రావడంతో ఆయన తీవ్రంగా ఆవేదనకు లోనయ్యారట. ఆ టైం లోనే ఆమె మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉండగా, జెమినీ గణేషన్ ఆ మృతదేహాన్ని తన ఇంటి వద్ద ఉంచేందుకు అనుమతించారట. ఆ టైంలో సావిత్రిని చూసేందుకు రెండు కిలోమీటర్ల మేర జనాలు ఎగబడి వచ్చారని, ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె అంతిమయాత్రలు ఆమెకి ఇష్టమైన మల్లెపూలతో అడుగడుగున బాధతో పూలు చల్లారని తెలుస్తోంది.
also read: