Home » ఆ హీరో వల్లే నగ్మా రాత్రికి రాత్రే చెన్నై నుండి పారిపోవలసి వచ్చిందా..?

ఆ హీరో వల్లే నగ్మా రాత్రికి రాత్రే చెన్నై నుండి పారిపోవలసి వచ్చిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నగ్మా 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన రెండవ తండ్రి చంద్ర సదన్ నగ్మాను ఎలాగైనా హీరోయిన్ చేయాలని, ఆమెను చిన్న వయసులో ఉన్నప్పుడే షూటింగ్ సెట్స్ కి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న దర్శకనిర్మాతలకు పరిచయం చేసి నగ్మాకు సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండని అడిగేవాడు. కానీ అమ్మాయి చాలా చిన్నదిగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూద్దాం లే అని చెప్పారట.కానీ చంద్ర సదన్ ఎలాగైనా నగ్మాని పెద్ద దానిలా చేయాలని, ఆర్థిక సమస్యల నుండి బయట పడాలని నగ్మాకు ఇష్టం లేకపోయినా హార్మోన్ ఇంజెక్షన్లు వేయించారని తెలుస్తోంది. దీనివల్ల కొన్ని రోజుల్లోనే నగ్మా బాడీ పెరిగిపోయిందని, అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు నడిచాయి.

Advertisement

also read:థియేటర్ లోకి రానున్న కలర్ ఫోటో..!

చంద్ర సదన్ ప్రొడ్యూసర్ అయినా తనకు తెలిసిన దర్శకనిర్మాతలను కలిసినా నగ్మాకు సినిమా ఛాన్సులు రాలేదు. ఆ టైంలో బాలీవుడ్ మొత్తం మాఫియా చుట్టూ తిరుగుతుంది. వారు ఏది చెప్తే అది జరిగేది. ఆ విధంగా చంద్ర సదన్ మాఫియా గ్రూప్ ని కలిసి నగ్మాని పరిచయం చేసి, చాన్స్ ఇప్పించమని కోరారు. ఆ టైం లోనే సల్మాన్ ఖాన్ హీరోగా “భాగీ” సినిమాకు హీరోయిన్లను వెతుకుతున్న సమయంలో ఈ మూవీకి మాఫియా రికమెండేషన్ వల్ల నగ్మా సెలక్ట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు ఇండస్ట్రీలో “పెద్దింటి అల్లుడు” సినిమాలో సుమంత్ సరసన నటించింది.ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి నాగార్జున, చిరంజీవిలతో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టడంతో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది నగ్మా..

Advertisement

నగ్మా పర్సనల్ విషయానికి వస్తే కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో లవ్ లో పడిందని వార్తలు రావడంతో ఈ విషయం గంగూలీ భార్యకు తెలియడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ వచ్చిందట. ఆ తర్వాత తమిళ్ హీరో శరత్ కుమార్ తో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేసింది. ఈ సమయంలో నగ్మా కోసం ఆయన మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేసారు. ఈ విషయం శరత్ కుమార్ భార్యకు తెలియడంతో ఆయనకు విడాకులు ఇచ్చింది. విడాకులు తీసుకున్న శరత్ కుమార్ నగ్మాని పెళ్లి చేసుకోకుండా రాధికను వివాహం చేసుకున్నారు. దీంతో నగ్మా శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చేయకుండా, వేరే సినిమాలు చేస్తూ ఉండేది. దీంతో శరత్ కుమార్ కోపానికి గురై తన రౌడీ గ్యాంగ్ ను నగ్మా ఇంటికి పంపించి సినిమా కంప్లీట్ చేయకపోతే చంపేస్తామని బెదిరించారట, దీంతో రాత్రికి రాత్రే నగ్మా అక్కడి నుండి పారిపోయిందని అప్పట్లో టాక్ వినిపించింది.

also read:

Visitors Are Also Reading