Ad
టాలీవుడ్ లోని యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒక్కడు. అయితే ఇండస్ట్రీలోని ఎప్పుడో వచ్చినా.. నిఖిల్ కెరియర్ అనేది మాత్రం స్వామిరారా, కార్తికేయ సినిమాలతోనే మారింది అనేది మాత్రం అందరికి తెలుసు. ఈ రెండు సినిమాల తర్వాత వరుస హిట్స్ అనేవి ఇస్తూ వచ్చాడు నిఖిల్. అందువల్ల నిఖిల్ సినిమాల పైన ప్రజలకు ఓ మంచి ఒపినియన్ అనేది ఏర్పడింది. కానీ నిఖిల్ చివరగా తీసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.
నిఖిల్ చివరి సినిమాల్లో కేశవ, అర్జున్ సురవరం సినిమాలు పుర్తిగా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక కిరాక్ పార్టీ అనే సినిమా మాత్రం పర్లేదు అనిపించింది. అందుకే ఇప్పుడు మళ్ళీ సాలిడ్ హిట్ అనేహి కొట్టాలి అనే ఉద్దేశ్యంలో నిఖిల్ తనను హిట్ ట్రాక్ ఎక్కించిన కార్తికేయ సినిమా సీక్వెల్ పైన ఆధారపడ్డాడు. ఇప్పుడు చందు మొండేది దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు. రేపు ఈ సినిమా విడుదల కానుండగా.. ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నాడు.
అయితే తాజాగా ఇప్పుడు జనాలు ఎక్కువగా ఓటీటీలకు అలవాటు పడి థియేటర్లకు రాకపోవడంపై నిఖిల్ స్పందించాడు. సినిమా అనేది బాగుంటే ప్రజలు తప్పకుండ థియేటర్ కు వస్తారు. అందుకే అందరూ సాధ్యమైనంత మంచి కథతో సినిమాలు అనేవి తీసి విడుదల చేసి.. వారిని మెప్పించగలిగితే ప్రజలు మళ్ళీ థియేటర్ లో సినిమాలు అనేవి చూడటానికి ఇష్టపడుతారు అని నిఖిల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
ముందు మహిళలు.. తర్వాతే పురుషులు అంటున్న బీసీసీఐ..!
పంత్ పరువు తీసిన ఊర్వశీ…!
Advertisement