సినీ ఇండస్ట్రీ అంటే సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన వారిదె అనే విధంగా మారింది అంటూ యంగ్ హీరో అడివి శేష్ అన్నారు. ఈ హీరో 2010లో విడుదలైన కర్మ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో పంజా, రన్ రాజా రన్, బలుపు, బాహుబలి వంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్ గా చేశాడు. 2016లో క్షణం అనే మూవీ ద్వారా లీడ్ రోలు పోషించాడు. ఈ మూవీ ఆయన కెరియర్ ను మార్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎవరూ, గూడాచారి, మేజర్, వంటి వరుస హిట్లతో కాకుండా హిట్ 2 సినిమా ద్వారా స్టార్ హీరోగా మారిపోయాడు అడవి శేష్. అయితే తాజాగా టాలీవుడ్ పై శేషు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
Advertisement
also read:Health Tips : రాత్రిపూట పొరపాటున కూడా వీటిని తినవద్దు..!
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఫ్యామిలీ నుంచి కనీసం 10 మంది హీరోలు ఉన్నారని ఈ క్రమంలో బయటి వ్యక్తికి మంచి స్క్రిప్ట్ దక్కడం చాలా కష్టమని అన్నారు. ఒక మంచి స్క్రిప్ట్ మాలాంటి వారి దాకా రావాలి అంటే మా నెంబర్ 53. ఇదే సమయంలో 20 మాత్రమే మంచి స్క్రిప్టులు ఉండటంతో మిమ్మల్ని ఎవరు పరిగణలోకి తీసుకోరని, ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడిషన్ కల్చర్ ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లీడ్ రోల్స్ తో పాటు ఇంపార్టెంట్ పాత్రలన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలకు మాత్రమే ఇక్కడ ఆడిషన్స్ ఉంటాయని అడవిశేష్ తెలియజేశారు.
మాలాంటి వారికి ముఖ్యమైన రోల్స్ దక్కాలి అంటే కథల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మరి ముఖ్యంగా కథలు సొంతంగా రాసుకోవడమే ఏకైక ఆప్షన్ అన్నారు. అయితే ఇండస్ట్రీలో తనకి అన్నీ తెలుసని నేను అనుకోనని, ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎందుకు అలా జరిగిందో తెలుసుకుంటానని తెలియజేశారు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో నిడదొక్కుకోవాలంటే మన ఫలితమే అన్నిటికంటే ముఖ్యమని పేర్కొన్నారు.
also read: