దేశంలో ప్రముఖులు ప్రస్తుతం పరిస్థితుల్లో హెలికాప్టర్లు అంటే భయపడుతున్నారు. వరుస ప్రమాదాల తో ఇప్పటి కి చాలా మంది ప్రముఖుల హెలికాప్టర్ ప్రమాదాల లో మరణించారు. తాజా గా తమిళ నాడు రాష్ట్రం లోని ఊటి సమీపం లో ఆర్మి హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదం లో భారత త్రివిధ దళ అధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతిమణీ తో సహా మొత్తం 13 మంది మృతి చెందారు. అయితే మన దేశం లో ప్రముఖుల కు హెలికాప్టర్ ప్రమాదం జరగడం కొత్తేమీ కాదు. గతం లో చాలా మంది ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదం లో మరణించారు.
Also Read: బిగ్ బాస్ విన్నర్ మానస్..అతడిపై నాకున్న ఫీలింగ్ అదే ప్రియాంక సింగ్
Advertisement
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రా నికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో హెలికాప్టర్ ప్రమాదం లో మరణించాడు. 2009 సెప్టెంబర్ 2న నల్లమల్ల అడువుల్లో ఈ ప్రమాదం జరిగింది. అలాగే తెలుగు హీరోయిన్ సౌందర్య కూడా హెలి కాప్టర్ ప్రమాదం లో నే చనిపోయింది. 2004 ఏప్రిల్ 17న బెంగళూర్ లో జరిగిన ప్రమాదం లో సౌందర్య మృతి చెందింది.అలాగే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న దేశ రాజధాని లో నే విమాన ప్రమాదం లో చనిపోయాడు. ఢిల్లీ లోని సఫ్ధర్ జంగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ప్రమాదం లో సంజయ్ గాంధీ మరణించారు.
Advertisement
కాంగ్రెస్ నేత మాధవ రావు సింథియా కూడా 2001 సెప్టెంబర్ 30 కాన్పూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో మరణించాడు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం ధోర్జీ ఖండూ కూడా 2011 ఏప్రిల్ 30 న అరుణాచల్ ప్రదేశ్ లో నే హెలికాప్టర్ ప్రమాదం వల్ల మృతి చెందాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభ స్పీకర్ గా చేసిన టీడీపీ నేత జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న పశ్చిమ గోదావరి లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో మరణించాడు. ఓపీ జిందాల్ అనే హర్యాణా రాష్ట్ర మంత్రి కూడా 2005 మార్చి 31న ఉత్తర ప్రదేశ్ లో జరిగిన హెలి కాప్టర్ ప్రమాదం కన్నుమూశారు. ఇలా చాలా మంది ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదం లో మృతి చెందడం తో ప్రస్తుతం పలువురు ప్రముఖులు హెలి కాప్టర్ లో ప్రయాణించాలంటే నే జంకుతున్నారు.
Also Read: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కీలకం కానుందా?