Home » బిగ్ బాస్ విన్న‌ర్ మాన‌స్..అత‌డిపై నాకున్న ఫీలింగ్ అదే ప్రియాంక సింగ్

బిగ్ బాస్ విన్న‌ర్ మాన‌స్..అత‌డిపై నాకున్న ఫీలింగ్ అదే ప్రియాంక సింగ్

by AJAY
Ad

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన ప్ర‌తి కంటెస్టెంట్ బిగ్ బాస్ బ‌జ్ కు వ‌చ్చి ఇంట‌ర్య్వూ ఇస్తుంటారు. అంతే కాకుండా బిగ్ బాస్ బ‌జ్ హోస్ట్ గా కూడా గ‌త సీజ‌న్ సభ్యుల్లో ఒక‌రు ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే సీజ‌న్ 5 కి హోస్ట్ గా అరియానా గ్లోరీ చేస్తున్నారు. కాగా తాజాగా బిగ్ బాస్ నుండి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. దాంతో ప్రియాంక బిగ్ బాజ్ లో వ‌చ్చిన ఎపిసోడ్ నేడు ప్రసార‌మ‌య్యింది. ఈ ఇంట‌ర్వ్యూలో ప్రియాంక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ సీజ‌న్ లో విన్న‌ర్ ఎవ‌రు అవుతార‌ని అరియానా ప్ర‌శ్నించ‌గా మాన‌స్ అంటూ అన్స‌ర్ ఇచ్చింది.

Advertisement

priyanka singh on manas

priyanka singh on manas

అంతే కాకుండా మాన‌స్ పై నీకున్న ఫీలింగ్ ఏంటి అని ప్ర‌శ్నించ‌గా మాన‌స్ త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మే అంటూ చెప్పింది. ఇక ప్ర‌స్తుతం హౌస్ లో ఉన్నవారిలో త‌న ఫేవ‌రెట్ కంటెస్టెంట్ లు ఎవ‌రని ప్ర‌శ్నించగా మాన‌స్, స‌న్నీ మ‌రియు సిరి హ‌న్మంత్ పేర్ల‌ను చెప్పింది. బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయం ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా బిగ్ బాస్ అంటే ఏమీ లేద‌ని కానీ ఏదో నేర్చుకోవ‌డం అంటూ స‌మాధానం ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ లోకి ట్రాన్స్ జెండ‌ర్ గా ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే గ‌తంలో కూడా బిగ్ బాస్ తెలుగులోకి ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎక్కువ వారాలు ఇంట్లో ఉండలేక‌పోయింది. కానీ ప్రియాంక సింగ్ మాత్రం టాప్ సెవెన్ వ‌ర‌కూ బిగ్ బాస్ లో కొన‌సాగింది. అంతే కాకుండా ప్రియాంక ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే కంటెంటె ఇచ్చేందుకో లేదంటే మాన‌స్ ను నిజంగానే ఇష్ట‌ప‌డిందో గానీ మాన‌స్ తో ప్రియాంక చేసిన ఫ్రెండ్ షిప్ ఈ సీజ‌న్ కు కాస్త ప్ల‌స్ అయ్యింది. ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచిన డ్రామా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

Visitors Are Also Reading