Home » గన్న‌వ‌రంలో హీటెక్కెన రాజ‌కీయం.. వైసీపీ నేత‌ల మ‌ధ్య ఫైట్‌..!

గన్న‌వ‌రంలో హీటెక్కెన రాజ‌కీయం.. వైసీపీ నేత‌ల మ‌ధ్య ఫైట్‌..!

by Anji
Ad

గ‌న్న‌వ‌రం రాజ‌కీయాలు చాలా హీటెక్కాయి. వైసీపీలో వ‌ర్గ‌పోరు తారా స్థాయికి చేరింది. ఈ పంచాయ‌తీ వైసీపీ అగ్ర‌నేత విజ‌య‌సాయి రెడ్డి దాకా వ‌చ్చింది. దీంతో గ‌న్న‌వ‌రం టాక్ ఆఫ్ దీ ఏపీగా మారింది. ఏపీ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కృష్ణాజిల్లా ఆ జిల్లాలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానిది ప్ర‌త్యేక‌స్థానం. ఇప్పుడు అక్క‌డ రాజ‌కీయం మంచి కాక‌మీద ఉంది. ఎన్నిక‌ల‌కు రెండేండ్లు ముందుగానే ఎమ్మెల్యే టికెట్ కోసం పైర‌వీలు మొద‌ల‌య్యాయి. అటు నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జీ మ‌ళ్లీ యార్ల‌గ‌డ్డ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోరుతున్నారు కార్య‌క‌ర్త‌లు. టీడీపీ త‌రుపున గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యేగా గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, సీఎం జ‌గ‌న్ బాగా ద‌గ్గ‌ర అయ్యారు. అప్ప‌టి నుంచి గ‌న్న‌వ‌రంలో వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయి. దీంతో దుట్టా రామ‌చంద్రారావు వ‌ర్సెస్ వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌యా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ అన్న‌ట్టుగా మారింది రాజ‌కీయం.


తాజాగా ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై విజ‌య‌సాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు కొంత మంది నాయ‌కులు. త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. విజ‌య‌సాయి వ‌ద్ద వాపోయ్యారు. గ‌తంలో వైసీపీ ఓట‌మి కోసం ప‌ని చేసి టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ.. త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని వాపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ఎమ్మెల్యే టికెట్ వంశీకి ఇవ్వ‌వ‌ద్ద‌ని, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్‌కే ఇవ్వాల‌ని విజ‌య‌సాయిని నేత‌లు కోరారు.

Advertisement

Advertisement

కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుపుకొని పోతాన‌ని వైసీపీలోకి వ‌చ్చిన వంశీ, త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఇది చాలా సున్నిత‌మైన అంశ‌మ‌ని.. కొన్నాళ్ల‌లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు విజ‌యసాయిరెడ్డి. ఈ స‌మ‌స్య‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లి అన్ని స‌ర్దుకునేలా చేస్తాన‌ని చెప్పారు. గ‌తంలోను దుట్టా వ‌ర్గం, వ‌ల్ల‌భ‌నేని వ‌ర్గాలు బాహాబాహికి దిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వంశీ స‌మ‌క్షంలోనే కుర్చీల‌తో కొట్టుకున్నారు. ఇటీవ‌ల పోలీస్ స్టేష‌న్ల వ‌ర‌కు వెళ్లింది వీరి వ‌ర్గ‌పోరు. యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ స్వ‌యంగా స్టేష‌న్‌కు వెళ్లి త‌న అనుచ‌రుల‌ను విడిపించాల్సి వ‌చ్చింది. వంశీ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అనేక వివాదాలు జ‌ర‌గ‌డం వైసీపీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. దీనిపై జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read :  ఆల‌స్యంగా పెళ్లి చేసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు…తెలిస్తే ఒప్పుకోవాల్సిందే…!

Visitors Are Also Reading