మనిషికి నిద్ర చాలా మంచి చేస్తుంది అని నిపుణులు చెబుతుంటారు. నిజమే రాత్రిపూట గాఢ నిద్ర మనిషి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని నిద్ర మెరుగుపరుస్తుంది. సరిగ్గా నిద్రలేనట్టయితే బీపీతో పాటూ మరికొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా సరిగా నిద్రపోతే మరుసటి రోజు ఉదయం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.
Advertisement
అదే నిద్రసరిగా లేనట్టయితే నీరసంగా ఉంటారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. కొంతమంది మధ్యాహ్నం కునుకు తీయకుండా అస్సలు ఉండలేరు. కొందరైతే మధ్యాహ్నం కూడా రాత్రి పడుకున్నట్టుగా గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు.
Advertisement
అయితే మధ్యాహ్నం ఎక్కువ సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. లంచ్ బ్రేక్ తరవాత కేవలం 5 నుండి 10 నిమిషాల నిద్ర మంచిదని అది మనసుకు ప్రశాంతతను ఇస్తుందని చెబుతున్నారు. మనిషి రీ ఫ్రెష్ అవుతాడని చెబుతున్నారు. ఈ చిన్న నిద్రను పవర్ నాప్ అని అంటారు.
పవర్ నాప్ సమయం 5నిమిషాల నుండి 20 నిమిషాల మధ్యన ఉంటుందట. కానీ కొంతమంది గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు. అది కొంతకాలం తరవాత మానసిక రుగ్మతగా మారుతుందట. మధ్యాహ్న నిద్ర లేకుండా అలాంటి వారు ఉండలేరట. అంతే కాకుండా మధ్యాహ్నం గంటల తరబడి నిద్రపోవడం వల్ల కలవరం మరియు ఇతర మానసిక రుగ్మతలు వస్తాయట.
ALSO READ : రేణుకకి డబ్బు ఆశ.. ప్రవీణ్ కి అమ్మాయిల కోరిక.. కీలక అంశాలు వెలుగులోకి !