Home » ఈ వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ అతడే..!

ఈ వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ అతడే..!

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఎప్పుడు ఎవ్వరూ పుంజుకుంటున్నారో.. ఎప్పుడూ ఎవ్వరూ ఆడటం లేదో గుర్తించడం చాలా కష్టంగానే మారింది. ప్రారంభంలో ఆస్ట్రేలియా జట్టు కాస్త తడబడింది. ఆ తరువాత పుంజుకుంది. మరోవైపు పసికూన అప్గానిస్తాన్ జట్టు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లను ఓడించి అందరినీ ఆశ్చర్యపరించింది. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ జట్టు గురించే. వరల్డ్ కప్ 2023 లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు.

Advertisement

ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్ లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ వీర విహారం చేస్తున్నారు. హరీష్ రావూఫ్ బౌలింగ్ పై వెస్టిండీస్ మాజీ ఆటగాడు శామ్యూల్ బద్రీ స్పందించాడు. ఈ ప్రపంచకప్ లో ఫెయిల్యూర్ బౌలర్లలో హరీస్ రవూఫ్ ఒకడని శామ్యూల్ బద్రీ అన్నాడు. ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్స్ హరీస్ రవూఫ్ బంతుల్లో విపరీతంగా రన్స్ చేయగలుగుతున్నాడని అన్నాడు. అంతేకాకుండా ఈ ప్రపంచకప్ లో అతని బౌలింగ్ లో అత్యధిక సిక్సర్లు బాదారని తెలిపాడు.

Advertisement

ఇప్పటివరకు ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ హరీస్ రవూఫ్ బౌలింగ్ లో 14 సిక్సర్లు కొట్టారన్నాడు. ఈ టోర్నీలో హరీస్ రవూస్ ఫాంలో లేడని.. దీంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు సులభంగా పరుగులు చేస్తున్నారని పేర్కొన్నాడు.  మరోవైపు ఈ ప్రపంచ కప్ లో బాబర్ ఆజమ్  సారధ్యంలోని పాకిస్తాన్ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది . ఇప్పటివరకు పాకిస్తాన్ 6 మ్యాచ్ లు  ఆడగా.. కేవలం మూడు మాత్రమే గెలిచింది. మరో మూడు మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. పాయింట్లు పట్టికలో పాకిస్తాన్ ఏడు స్థానంలో ఉంది ఇక ఈ జట్టు సెమిస్ కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తుంది.  ఏం జరుగతుందనేది వేచి చూడాలి మరీ.  వరల్డ్ కప్ మ్యాచ్లో ఏమైనా మాయాజాలం జరిగితేనే సెమీస్ కి పాకిస్తాన్ వెళ్లే అవకాశం ఉంది.

Visitors Are Also Reading