Home » అదృష్టం అంటే ఇదే మరీ.. లాటరీ టికెట్ కొన్న గంట సేపటికే రూ.కోటి జాక్ పాట్..!

అదృష్టం అంటే ఇదే మరీ.. లాటరీ టికెట్ కొన్న గంట సేపటికే రూ.కోటి జాక్ పాట్..!

by Anji
Ad

పంజాబ్ లోని గురుదాస్ పుర్ జిల్లా హల్కా డేరా బాబా నానక్ టౌన్ కి చెందిన రూపిందర్ జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ బ్యాంకులో క్లర్క్ గా పని చేస్తున్నాడు. ఎలాగైనా కోటిశ్వరుడు కావాలనే ఆశతో ఈయన గత ఏడాది కాలంగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగాలాండ్ ఏజెంట్ నుంచి 25 లాటరీ టికెట్లు ఒక్కోటి రూ.6చొప్పున కొనుగోలు చేసాడు. ఆ తరువాత బ్యాంకుకు వెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. 

Advertisement

ఇంతలోనే గంట సేపటి తరువాత అంటే సరిగ్గా ఒకటి గంటలకు రూపిందర్ జిత్ కి ఫోన్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్.. మీరు రూ.కోటి గెలుచుకున్నారు అంటూ లాటరీ ఏజెంట్ ఫోన్ లో తెలిపాడు. దీంతో తోటి బ్యాంకు సిబ్బంది రూపిందర్ జిత్ ను చుట్టు ముట్ట అభినందనల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ బల్జీందర్ సింగ్, కన్వల్ జిత్ సింగ్ భిందర్, హర్మన్ దీప్ సింగ్, ఇతర ఉద్యోగులు స్వీట్స్ పంచి సంతోషాన్ని పంచుకున్నారు. ఇదంతా చూస్తుంటే తనకు కలగా ఉందని.. ఇన్నాళ్ల తన కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని రూపిందర్ జిత్ అన్నాడు.

Advertisement

లాటరీలో గెలుచుకున్న డబ్బుతో తన పిల్లలు, కుటుంబ భవిష్యత్ కోసం ఖర్చు చేస్తానన్నాడు. పేదల కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తానన్నాడు. బ్యాంకు క్లర్క్ రూపిందర్ లాటరీ ప్రైజ్ గలుచుకోవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమ్రోగింది. గతంలోనే ఇదే ప్రాంతంలో ఓ కిరాణ దుకాణం యజమాని రూ.2.5 కోట్ల లాటరీ ప్రైజ్ ని గెలిచిన విషయం విధితమే. చాలా వరకు లాటరీ టికెట్లను అంతగా ఎవ్వరూ నమ్మడం లేదు. ఇలాంటి లక్ కలిసి రావడంతో ఎగబడి మరీ కొంటున్నారు టికెట్లు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శ్రీజ ఆ పని చేయకపోయుంటే అల్లు వారి కోడలు అయ్యేదా ? స్టార్ హీరో భార్య ఛాన్స్ మిస్..!

ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

 

Visitors Are Also Reading