నందమూరి హీరో హరికృష్ణ తన సినీ కెరీర్ లో నటించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. అయినప్పటికీ ఆయా సినిమాల్లో మెజార్టీ సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. హరికృష్ణ వైవీఎస్ చౌదరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పవచ్చు. ఈ కాంబోలో తెరకెక్కిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీ ప్రేక్షకుల మన్ననలను గెలుచుకోవడంతో పాటు అంచనాలను మించి మెప్పించిందనే విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
అయితే ఈ సినిమాలోని ఓ సీన్ కోసం హరికృష్ణ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టారట. సినిమాలోని ఒక సీన్ లో హీరో హరికృష్ణ కారు విలన్ జయప్రకాశ్ జీపు రైల్వే ట్రాక్ పై మధ్యలో ఆగుతాయి. రైలు రావడంతో జయప్రకాశ్ రెడ్డి జీపు వెనక్కి వెళ్తుంది. ఆ తరువాత హరికృష్ణ కారు ముందుకు వచ్చేవిధంగా సీన్ ప్లాన్ చేశారు.
Advertisement
ఆ సమయంలో కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా స్టార్ట్ కాలేదట. సాధారణంగా ఇలా జరిగితే ఎవ్వరైనా కారులోనుంచి బయటికీ వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. హరికృష్ణ మాత్రం ఎదురుగా రైలు వస్తున్నా.. ప్రయత్నించి మూడో ప్రయత్నంలో స్టార్ట్ చేశారట. ఈ సీన్ తరువాత సినిమాలో మగాడన్నాక తెగింపు ఉండాలి. చావుకు మనం భయపడకూడదు.. చావే మనల్నీ చూసి భయపడాలి అనే డైలాగ్ ను చెబుతారు.
వాస్తవానికి ఈ డైలాగ్ హరికృష్ణకి కరెక్ట్ సూట్ అవుతుందని.. ఆ తెగింపు ఉందని కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హరికృష్ణ భౌతికంగా మరణించినప్పటికీ.. అభిమానుల గుండెల్లో మాత్రం జీవించే ఉన్నారు. హరికృష్ణ కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా.. కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది.
Also Read : టాలీవుడ్ లవబుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత లవ్ స్టోరీలో దాగి ఉన్న రహస్యం ఇదే..!