టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా పేరు తెచ్చుకున్నటువంటి నాగచైతన్య సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ 2017 సంవత్సరంలో ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం జరుపుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్త ప్రేక్షకుల మనసులను కలచివేసింది. ఇప్పటికి వీరిద్దరూ కలిస్తే చాలా బాగుండు అని ఎంతో మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య మళ్లీ ఒకటవబోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది.
ఈ విషయం తెలిసిన అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. వీరిద్దరూ విడాకుల అనంతరం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీరిద్దరికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ వారు పరోక్షంగా స్పందిస్తుంటారు. తాజాగా నాగచైతన్య తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి బైక్ ని కొనుగోలు చేసి దాని మీద నాగచైతన్యను ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరగా… అందుకు నాగచైతన్య ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా ఆ బైక్ ని డ్రైవ్ కూడా చేశాడు. ఆ సమయంలో కెమెరా కంట నాగచైతన్య వద్ద ఉన్న ఒక పెట్ డాగ్ కనిపించింది. అది అచ్చం సమంత వద్ద ఉన్న హస్ మాదిరిగానే ఉంది. ఈ వీడియో చూసిన చాలామంది ఇది సమంత వద్ద కదా ఉండాల్సింది నాగచైతన్య వద్ద ఉంది ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు. అయితే వీరిద్దరు మళ్ళీ కలుసుకోబోతున్నారా? వీరిద్దరూ టచ్ లో ఉన్నారా? అని కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement
ఇక మరికొందరేమో అలాంటిది ఏమీ లేదని… ఇద్దరివద్ద చెరోకటి ఉందనీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వార్తలపై వారిద్దరూ స్పందిస్తే కానీ అసలు నిజం తెలియదు. థాంక్యూ సినిమా సమయంలో నాగచైతన్య తన పెట్ గురించి మాట్లాడుతూ… థాంక్యూ అనేది నా దృష్టిలో చాలా గొప్ప పదం. అది నా జీవితంలో కేవలం ముగ్గురికి మాత్రమే థాంక్స్ చెప్పాలి. ఒకటి మా నాన్న, అమ్మ, సమంత పెట్ హస్ ఫోటోలను షేర్ చేశాడు. దీన్ని బట్టి చైతన్యకు తన పెట్ డాగ్ అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. ఇక విడాకులు అనంతరం సమంత తన పెట్ ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక ఏదిఏమైనప్పటికీ వీరిద్దరూ కలవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- MS Dhoni : చరణ్-ధోని కాంబోలో పాన్ ఇండియా మూవీ !
- ఇండియా వర్సెస్ పాక్ మధ్య సరికొత్త సిరీస్… గాంధీ-జిన్నా ట్రోఫీ పేరుతో ?
- “చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం” ?