తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోగా కొనసాగారు హీరో సిద్ధార్థ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, బావ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు లో మంచి స్టేజిలో ఉండగానే ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి సిద్ధార్థ్ ను ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేసారట.. అసలు విషయం ఏంటో చూద్దాం.. తాజాగా సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న టక్కర్ ఈనెల 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Advertisement
ఈ తరుణంలో ఆయన ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. నేను హీరోగా చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా కి చాలా అవార్డులు వచ్చాయని, అంతేకాకుండా బొమ్మరిల్లు సినిమాకి కూడా అనేక అవార్డులు వరించాయని తెలియజేశారు.
Advertisement
నేను నటించిన సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చినా కానీ బెస్ట్ యాక్టర్ గా మాత్రం నాకు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రతి చిత్రంలో నా నటన అద్భుతంగా ఉందని కొనియాడారు తప్ప అవార్డుల విషయంలో నన్ను ఎంకరేజ్ చేయలేదని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కావాలనే నాకు అవార్డ్స్ రాకుండా చేశారని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- తనకు క్యాన్సర్ లేదు.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..!
- రాగిజావ తాగితే ఇన్ని ప్రయోజనాలా..?
- ఎన్టీఆర్ గారికి భారతరత్న సత్కారం ఇవ్వకపోవడానికి గల కారణం ఇదేనా ?..?