Home » పాండ్య పేరిట అరుదైన రికార్డ్… ధోని, కోహ్లీ, రోహిత్ లకు కూడా సాధ్యం కాలేదు..!

పాండ్య పేరిట అరుదైన రికార్డ్… ధోని, కోహ్లీ, రోహిత్ లకు కూడా సాధ్యం కాలేదు..!

by Azhar
Ad
ప్రస్తుతం రెండు భారత జట్లు రెండు వేరు వేరు జట్లతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మొదటి జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉంది. ఇక రెండో జట్టు ఇప్పుడు ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో తలపడుతుంది. ఈ పర్యటనలో టీం ఇండియాకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో… భారత కెప్టెన్ హెదిక్ పాండ్య అరుదైన రికార్డును సాధించాడు. ఈ రికార్డ్ ఇప్పటివరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అదేంటంటే.. భారత కెప్టెన్ గా పాండ్య టీ20 లో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే గత ఏడాది టీం ఇండియా లో ఫిట్నెస్ కారణంగా చోటు కోల్పోయిన పాండ్య.. ఈ ఐపీఎల్ లో బాగా రాణించాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2022 లోకి కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవరించిన పాండ్య… మొదటి ఏడాదే ఆ జట్టుకు టైటిల్ ను అందించాడు. ఆ కారణంగానే ఈ సిరీస్ లో పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చింది బీసీసీఐ.  అయితే నిన్నటి మ్యాచ్ లో రెండో ఓవర్ వేసిన పాండ్య… ఐర్లాండ్ ఓపెనింగ్ బ్యాటర్ స్టిర్లింగ్ ను అవుట్ చేసాడు పాండ్య. దాంతో భారత టీ20 ఫార్మాట్ లో వికెట్ తీసుకున్న మొదటి కెప్టెన్ గా పాండ్య నిలిచాడు.
అయితే గతంలో భారత జట్టుకు టీ20 ఫార్మాట్ లో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌ కెప్టెన్సీ వహించారు. ఇందులో ఎవరు కిడా కెప్టెన్సీ హిందలో ఉండి వికెట్ ను తీసుకోలేదు. అయితే ఈ టీ20ల్లో కోహ్లీ, రైనా, రోహిత్‌ వికెట్లు తీసినప్పటికీ.. వారు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కాకుండా… జట్టులో ప్లేయర్‌గా ఉన్నప్పుడు వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ మాత్రమే కాకుండా.. బ్యాటింగ్ లో కూడా పాండ్య అదరగొట్టాడు. 12 బంతులు ఎదుర్కున్న పాండ్య 3 సిక్సులు.. ఒక్క ఫోర్ సహాయంతో 24 పరుగులు చేసిన భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Visitors Are Also Reading