భారత జట్టుకు ప్రస్తుతం మూడు ఫార్మట్స్ లలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. అయితే కోహ్లీ తప్పుకోవడంతో ఈ పొజిషన్ లోకి వచ్చిన రోహిత్.. ప్రస్తుతం ముఖ్యమైన భారత జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళాడు. అలాంటి సమయంలో బీసీసీఐ మరో జట్టును తయారు చేసి ఐర్లాండ్ కు పంపింది. అయితే రోహిత్ తర్వాత కెప్టెన్లు అయిన కేఎల్ రాహుల్, పంత్ అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు పాండ్య. ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరించిన పాండ్య మొదటి ఏడాదే జట్టుకు టైటిల్ అందించాడు.
Advertisement
ఆ కారణంగానే ఏడాదిగా టీం ఇండియాలోలేని పాండ్యకు కెప్టెన్ గా అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటె.. ఈరోజు ఐర్లాండ్ తో కెప్టెన్ గా తన మొదటి మ్యాచ్ కు ముందు ప్రెస్ తో మాట్లాడిన పాండ్య రోహిత్ శర్మపైన ఉన్న తన కోపాన్ని వ్యక్తపరిచారు. పాండ్య మాట్లాడుతూ.. నేను ధోని, విరాట్ కోహ్లీల కెప్టెన్సీ నుండి చాలా నేర్చుకున్నాను అని చెప్పాడు. అయితే ఇందులో ఎక్కడ కూడా రోహిత్ శర్మ పేరు చెప్పలేదు. అయితే పాండ్య రోహిత్ కెప్టెన్సీలోనే 7 ఐపీఎల్ సీజన్స్ ఆడి 4 టైటిల్స్ గెలిచాడు. అయిన కూడా రోహిత్ పేరు చెప్పలేదు.
Advertisement
అందుకు కారణం ముంబై జట్టు తన రిటైన్ చేసుకోకపోవడమే అని అభిమానులు అంటున్నారు. అయితే ఆడిన 7 ఏళ్ళు ముంబై జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న పాండ్యను ఫిట్నెస్ లేని కారణంగా ఈ ఏడాది రిటెన్షన్ ప్రక్రియలో ఆ జట్టు వెన్నకి తీసుకోలేదు. అందుకే పాండ్య ముంబై పైన ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పైన కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వేలంలోకి వచ్చిన పాండ్యను గుజరాత్ జట్టు తీసుకుంది. ఆ జట్టు టైటిల్ కొట్టింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై మాత్రం దోరంగా విఫలమై వరుసగా 8 మ్యాచ్ లలో ఓడి పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది.
ఇవి కూడా చదవండి :