హర్భజన్ సింగ్ – శ్రీశాంత్ ఈ రెండు పేర్లు వినగానే అందరికి గుర్తుకు వచ్చే ఘటన 2008 ఐపీఎల్ లో జరిగిన సంఘటన. ఆ ఏడాదే మన బీసీసీఐ ఐపీఎల్ ను ప్రారంభించింది. ఇందులో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుండగాశ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక లీగ్ దశలో ఈ రెండు జట్లకు మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ హర్భజన్ వచ్చి శ్రీశాంత్ పైన చెయ్యి చేసుకున్నాడు. అప్పుడు ఈ వార్త పెద్ద వైరల్ గా మారింది. అలాగే మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ ఏడ్చిన ఫోటోలు కూడా బాగానే హల్ చల్ చేసాయి.
Advertisement
అయితే తాజాగా హర్భజన్ శ్రీశాంత్ ను కొట్టడం పైన స్పందించాడు. తాజాగా ఓ వీడియో కాన్ఫరెన్స్ వీడియోలో హర్భజన్ సింగ్ అలాగే శ్రీశాంత్ ఇద్దరు పాల్గొన్నారు. అందులో ఆ ఘటన గురించి హర్భజన్ మాట్లాడుతూ… నేను ఆరోజు తప్పు చేశాను. అప్పుడు ఆలా జరిగ్గి ఉండకూడదు. నా వాళ్ళ ఓ ఆటగాడి ఇబ్బంది పడ్డాడు అనే విషయం నాకు గుర్తుకు వచినప్పుడలా నేను చాలా సిగ్గు పడతాను. ఒకవేళ నా జీవితంలో ఏదైనా సరిదిద్దుకోలేని తప్పు ఈదిన ఉంది అంటే అది అదే అని హర్భజన్ పేర్కొన్నాడు.
Advertisement
నాకు ఆ ఘటన గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఏదో వెలితిగా అనిపిస్తుంది. అసలు నేను అలా చేసి ఉండకూడదు.. అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటాను’ హర్భజన్ చెప్పాడు. అయితే ఈ ఘటన తర్వాత ఐపీఎల్ గావర్కింగ్ కౌన్సిల్ బీసీసీఐ కలిసి హర్భజన్ పైన చర్యలు తీసుకున్నాయి. ఆ 2008 సీజన్ మొత్తానికి హర్భజన్ పైన ఐపీఎల్ బ్యాన్ విధించగా… బీసీసీఐ కూడా 5 వన్డేల బ్యాన్ ను విధించింది. కానీ ఈ ఘటన తర్వాత కూడా హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరు కలిసి భారత జట్టుకు ఆడారు. 2011 ప్రపంచ క్యూ గెలిచిన జట్టులో ఈ ఇద్దరు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :