Home » భారత్ – పాక్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదానికి కారణమైన ఆడి కారు.. ఎలా అంటే..?

భారత్ – పాక్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదానికి కారణమైన ఆడి కారు.. ఎలా అంటే..?

by Azhar
Ad

భారత మాజీ ఆటగాడి రవిశాస్త్రి ఎటువంటి వ్యక్తి అనేది అందరికి తెలుసు. ఎప్పుడు చిల్ అవుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రవిశాస్త్రి బయట ఎలా ఉన్న తాను క్రికెట్ ఆడుతున్న సమయంలో మాత్రం ఆట పరంగా చాలా ప్రేమతో సీరియస్ గా ఉండేవాడు. 1983 లో టీం ఇండియా మొదటి వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి ఆ తర్వాత 1985 లో బెన్సన్‌ అండ్‌ హెడ్జెజ్‌ వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించిన భారత జట్టులో కూడా సభ్యుడే.

Advertisement

ఈ టోర్నీ మొత్తం చాలా అద్భుతంగా రాణించాడు రవిశాస్త్రి. అలాగే ఫైనల్స్ లో పాకిస్థాన్ జట్టును ఓడించడంలో కీలక పాత్ర పోషించిన రవిశాస్త్రి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. అయితే అప్పుడు టోర్నీలో ఈ అవార్డు అందుకున్న ఆటగాడికి ఆడి కారు బహుమతిగా ఉండటంతో అది కూడా రవిశాస్త్రి కే వచ్చింది. కానీ ఈ ఫైనల్స్ లో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ తనను ఎలా అవమానించాడు అనే విషయాన్ని తాజాగా వెల్లడించాడు శాస్త్రి. ఈ మాటీసీగా ముగింపు దశలో ఉన్నప్పుడు జావెద్‌ మియాందాద్‌ సెట్ చేసిన ఫీల్డింగ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్‌ లెగ్‌ సైపు చూస్తున్నాను. అటువైపే ఈ కారు కూడా ఉంది.

Advertisement

దాంతో జావెద్‌ మియాందాద్‌ నా దగరకు వచ్చి.. ఆ కారును ఏం చూస్తున్నావ్.. నీకు ఆ కారు రాదు అని అన్నాడు. అప్పుడు వెంటనే నేను ఆ కారు వైపు చూడటం లేదు.. నాతో వస్తాను అన్నట్లు ఆ కారే నా వైపు చూస్తుంది చూడు అని కౌంటర్ ఇచ్చాను అని రవిశాస్త్రి తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచిన తర్వాత కారు కూడా రవిశాస్త్రికే వచ్చింది. అప్పుడే రవిశాస్త్రి కారు నడుపుతుంటే మన ఆటగాళ్లు అందరూ దాని పైన కూర్చొని ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక రవిశాస్త్రి క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటరీ చెప్పాడు. ఆ తర్వాత టీం ఇండియా హెడ్ కోచ్ గా కూడా పని చేసి.. ఇప్పుడు మళ్ళీ కామెంటరీ చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

బలమైన జట్టును పంపమంటూ ఇండియాకు పాక్ సలహా…!

అర్జున్ బ్యాటింగ్ బాలేదట… అందుకే ముంబైలో అఆడించలేదట..!

Visitors Are Also Reading