క్రికెట్ చరిత్రలో భారత జట్టును నడిపిన కెప్టెన్ లు చాలా మంది ఉన్నారు. కానీ అందులో గుర్తుండిపోయేవారు మాత్రం కొంత మంది మాత్రమే. అటువంటి వారిలో సౌరవ్ గంగూలీ కూడా ఒక్కడు. ప్రస్తుత బీసీసీఐ బాస్ గా కొనసాగుతున్న గంగూలీ న్యాయకత్వంలో టీం ఇండియా కొత్త దారిలోకి ప్రవేశించింది. కెప్టెన్ గా తాను మాత్రమే అగ్రెసివ్ కాకుండా.. మొత్తం జట్టుకు ఆ పద్దతిని అలవాటు చేసాడు గంగూలీ. అప్పటివరకు విదేశీ పర్యటనల్లో ఓటములతో సతమతమవుతున్నా భారత జట్టును గెలుపు బాటలోకి తీసుకువచ్చాడు.
Advertisement
అలాగే ఏంథి మంది క్రికెటర్లను కూడా జట్టులోకి తెచ్చి వారిని ప్రోత్సహించాడు. అందులో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఒక్కడు. 1996 లో కెప్టెన్ గా గంగూలీ బాధ్యతలు తీసుకున్న తర్వాత 1998 లో భారత జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత భజ్జీకి దాదా వరుస అవకాశాలు ఇవ్వగా… హర్భజన్ కూడా ఆ అవకాశాలను బాగానే ఉపయోగించుకొని భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఈ క్రమంలోనే తన వల్లే గంగూలీ కెప్టెన్సీ నిలబడింది అని లేకుంటే దాదా కెప్టెన్సీ పోయి ఉండేది అని హర్భజన్ అన్నాడు.
Advertisement
తాజాగా హర్భజన్ మాట్లాడుతూ… దాదా నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు. వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే దాదా నాకు అవకాశాలు ఇవ్వకపోతే అతను కూడా కెప్టెన్ గా ఉండేవాడు కాదు. 2001 లో ఆస్ట్రేలియాను ఓడించేవాడు కూడా కాదు అని హర్భజన్ అన్నాడు. ఎందుకంటే దాదా ఎన్ని అవకాశాలు ఇచ్చిన ఆడాల్సింది నేను. కాబట్టి నేను రాణించడం దాదాకు కూడా కెప్టెన్సీ పరంగా బాగా కలిసి వచ్చింది అని భజ్జీ అన్నాడు. ఇక ఈ మధ్యే క్రికెట్ కు వీడ్కోలు పలికిన హర్భజన్ ప్రస్తుతం ఆప్ పార్టీ తరపున రాజ్య సభలో సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :