టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. జాంబీరెడ్డి సినిమాలో నటించిన హీరో అంటే తెలుస్తుంది. కానీ ఇక నుంచి హను-మాన్ మూవీ హీరో అంటే అందరికీ తెలుస్తుంది. అలా హనుమాన్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు తేజ సజ్జా. ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది హనుమాన్ మూవీ. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూశారు. ఇవాళ సాయంత్రం ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ మరియు వివరణ :
కల్కి, జాంబీరెడ్డి వంటి మూవీస్ తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మూవీ హనుమాన్. సామాన్యుడికి దైవశక్తి తోడు అయితే లోక కళ్యాణం జరుగుతుందనే కోణంలో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కథ మొత్తం కూడా అంజనాద్రిలోని ఓ అటవీ ప్రాంత పల్లెలో జరుగుతుంది. హనుమంతు (తేజ సజ్జా), సోదరి అంజమ్మ (వరలక్ష్మీ)తో కలిసి నివాసం ఉంటారు. అంజమ్మ కష్టపడుతుంది. కానీ హనుమంతు చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. హనుమంతు దొంగతనాల వల్ల కొన్ని సార్లు అంజమ్మ పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఆ ఊరి స్కూల్ మాస్టర్ మనవరాలు మీనాక్షి (అమృత అయ్యర్). ఆమెతో చిన్నప్పుడే ప్రేమలో పడతాడు హనుమంతు. ఆమె పై బంది పోట్లు దాడి చేయడంతో ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు అని అందరూ భావిస్తారు.
కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా జలపాతంలో పడిపోతాడు. ఆంజనేయస్వామి రక్తధారతో ఏర్పడిన రుధిర మణి హనుమంతు కి దొరుకుతుంది. ఆ మణిని సూర్యుడి కాంతితో చూస్తే ఆంజనేయస్వామి శక్తులు లభిస్తాయి. ఆ శక్తులతో హనుమంతు ఊరికి మంచి చేయాలనుకుంటాడు. సూపర్ హీరో అయిపోవాలి అని కలలు కని సొంత తల్లిదండ్రులను చంపేసిన మైఖేల్ (వినయ్ రాయ్) హనుమంతుకి ఏవో శక్తులు వచ్చాయని తెలుసుకొని వస్తాడు. ఊరికి మంచి చేయడానికి వచ్చానని అందరినీ నమ్మించి మణిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. హనుమంతు నుంచి మైఖేల్ శక్తిని దక్కించుకున్నాడా..? ఆ శక్తి కేవలం ఉదయం మాత్రమే ఎందుకు పని చేస్తుంది.. అంజనాద్రికి వచ్చిన సమస్య ఏంటి.. అనే వివరాలు తెలియాలంటే హనుమాన్ మూవీని థియేటర్లలో వీక్షించాలి.
వాస్తవానికి ఇప్పటి వరకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చాలా మందిని చూశాం. కానీ మన ఇండియాలో ఉన్న సూపర్ మ్యాన్ హనుమాన్ అని చూపించాడు ప్రశాంత్ వర్మ. హనుమంతు కి విషయం అంతా చెప్పడం లాంటివి కన్విన్సింగ్ చెప్పడంతో ఎక్కడా బోరు కొట్టదు. హీరో తేజ బలహీన, బలమైన రెండు పాత్రల్లో అద్భుతంగా నటించాడు. అలా అని డబుల్ యాక్షన్ కాదండోయ్. హీరోయిన్ కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ పాత్ర ఇంకొద్ది సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. గెటప్ శ్రీను, రాకేష్ మాస్టర్ వంటి వారు కామెడీతో నవ్వించారు. వీఎఫ్ఎక్స్ చాలా అద్భుతమనే చెప్పాలి. అంజనాద్రి అందాలను, అటవీ ప్రాంతాలను, జలపాతాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్ వచ్చే సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మామూలుగా లేదు. హనుమాన్ మూవీ సంక్రాంతి పండుగకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందనే చెప్పవచ్చు.
పాజిటివ్ పాయింట్స్
- తేజ సజ్జా
- ప్రశాంత్ వర్మ దర్శకత్వం
- మ్యూజిక్
- వీఎఫ్ఎక్స్
నెగిటివ్ పాయింట్స్
- సెకండాఫ్ ఎక్కువ లెంత్
- కొన్ని సీన్లలో బోరు
రేటింగ్ 3.5/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!