2024 సంక్రాంతి బరిలో వచ్చిన గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా, హనుమాన్ చిత్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన సినిమాను తీశారంటూ ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Advertisement
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అంతే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. జక్కన్న టీంలోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. రాజమౌళి మేకింగ్ విధానం చాలా ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేందుకు ఎంతో ప్రయత్నించాను. ఇంజనీరింగ్ లోనే ఉండగానే ఆయన చాలాసార్లు మెయిల్స్ పంపించాను. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. టాలెంట్ ఉన్నా నన్ను ఎందుకు తీసుకోవడం లేదు అనే కారణంతో ఆయనపై చాలా కోపం వచ్చింది. అదే సమయంలో నాకు ఏకలవ్యుడు గుర్తుకొచ్చారు.
Advertisement
రాజమౌళి సినిమాలో మేకింగ్ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నాను అని చెప్పాను. అంతేకాదు.. పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. వారితో సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. అలాంటి వారి కోసం ఎదురుచూసి నా సమయాన్ని వృధా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత డెడ్ లైన్ పెట్టుకొని మరీ వర్క్ చేస్తున్నట్టు పేర్కొన్నా.. ఒకవేళ టామ్ క్రూజ్ వచ్చిన నా వద్ద ఉన్న వాళ్ళతోనే సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!