Home » ఆసియాలోనే రిచెస్ట్ ప‌ర్స‌న్ అదాని

ఆసియాలోనే రిచెస్ట్ ప‌ర్స‌న్ అదాని

by Anji
Ad

పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఎఫ్ఎంసీజీ, గ్యాస్ ఇలా అనేక చిత్రాలలో బిజినెస్ చేస్తున్నా ఆదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదాని.. ప్రపంచ ధనవంతుల కంటే వేగంగా సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ఆయన సంపాదన ఎలెన్ మస్క్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్ వంటి మహామహుల సంపాదనను దాటేసింది. మూడు నెలల్లోనే  గౌతమ్ అదాని సంపద ఏకంగా 21.1 బిలియన్ జాలర్లు పెరగడం విశేషం.

Advertisement

ఇప్పటివరకు కు ఏ బిలియనీర్ కూడా అదాని అంత సంపదను పెంచుకో లేకపోయారు. బ్లూమ్ బ‌ర్గ్‌ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి పీరియడ్ లో వారెన్ బఫెట్ సంపద 18 బిలియన్ డాలర్లు పెరిగింది. ఏడాది ఎక్కువ సంపాదించిన వారిలో ఆయన రెండవ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ ఏడాది తన సంపదను 8.24 బిలియన్ డాలర్లు పెంచుకాగలిగారు. దేశంలో లో కాస్ట్ ఎంత సంపన్నుల లో అంబానీ టాప్ లో ఉంటూ వస్తున్నారు. అదాని అంబానికి బాగా చేరువయ్యారు. ఈ ఏడాదిలో గౌతమ్ అదానీ సంపద 27 శాతం మేరకు పెరిగింది.

Advertisement


ఆసియాలో అత్యంత ధనవంతులుగా గౌతమ్ అదాని సంపద 97.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ముఖేష్ అంబానీ సంపద 98.2 బిలియన్ డాలర్లు. పోలీస్ స్థానం లో చెట్ల బాస్ ఎలన్ మస్క్ $275 ఉండగా … అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్‌బెజోస్ 188 బిలియ‌న్ డాల‌ర్లు, లూయిస్ విట‌న్ సీఈఓ బెర్నాల్డ్ ఆర్నాల్ట్ 149 బిలియ‌న్ డాల‌ర్లు టాప్ మూడు పొజిష‌న్‌ల‌లో ఉన్నారు. ముఖేష్ అంబానీ ప‌ద‌వ స్థానంలో గౌత‌మ్ అదాని 11వ ప్లేస్‌లో ఉన్నారు. టాప్ 10 మంది సంప‌న్నుల‌లో 8 మంది యూఎస్‌కు చెందిన వారే.. ఆసియాలోని అత్యంత సంప‌న్నుల లిస్ట్‌లో ముఖేష్ అంబానీ మొద‌టి స్థానంలో ఉండ‌గా.. గౌత‌మ్ అదానీ రెండ‌వ స్థానంలో నిలిచారు. అజీమ్ ప్రేమ్‌జీ 34.4 బిలియ‌న్ డాల‌ర్లు 36 వ స్థానంలో.. శివ్ నాడార్ 28.9 బిలియ‌న్ డాల‌ర్లు 46వ స్థానంలో, రాధాకిష‌న్ ద‌మానీ 20.7 బిలియ‌న్ డాల‌ర్లు 75వ స్థానంలో, ల‌క్ష్మీ మిట్ట‌ల్ 20.2 బిలియ‌న్ డాల‌ర్లు 78వ స్థానంలో ఉన్నారు.

Visitors Are Also Reading