మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు గా నటించారు. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ లావిష్ నిర్మాతగా వ్యవహరించారు.రవి బస్రూర్ సంగీతం అందించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది భీమా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కథ మరియు విశ్లేషణ :
భీమా పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ‘పరశురామక్షేత్రం’ చుట్టూ తిరుగుతుంది. బెంగుళూరు, బాదామి.. పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘పరశురామక్షేత్రం’లో పలు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని పోలీస్ ఆఫీసర్ భీమా ఎలా ఛేదించాడు? అతనికి పరశురామక్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే భీమా సినిమాని వీక్షించాల్సిందే.
Advertisement
ఈ సినిమాలో గోపిచంద్ ఎద్దు మీద కూర్చొని ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. సెకండాఫ్ కాస్త రొటిన్ గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు చాలా కీలకం. యాక్షన్ తో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంది. ఇందులో ప్రేమ, ఎమోషన్స్, రొ**మాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ కథలో సెమి ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతీ యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది.
పాజిటివ్ పాయింట్స్ :
- గోపిచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటన
- ఇంటర్వెల్ ఫైట్
- క్లైమాక్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్ :
- సెకండాప్ రొటిన్
- మధ్యలో సాగదీత
రేటింగ్ : 3/5
Also Read : లాల్‌సలామ్ ఫ్లాప్‌కు కారణం ఏంటో తెలుసా ?