మన జీవితాన్ని మనం ఊహించలేం.. ఏ టైంలో ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఎక్కడ ఉంటామో చెప్పడం కష్టమే.. ఎప్పుడైనా ఊహించామా కరోనా లాంటి విపత్తు వచ్చి ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుందని.. అలాంటిదే జీవితం
.. ఊహించలేనిది ఊహకందనిది.. ఇంత చిన్న జీవితంలో ఎన్నో ఈర్షలు, పగలు, కొట్లాటలు, తప్పుడు పనులు ఇంకా మరెన్నో.. ఎన్ని ఉన్నా చాలామంది లైఫ్ లో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అందరి లవ్ స్టోరీ పెళ్లి వరకు వెళ్లదు.. అలా వెళ్ళిన వారు లక్కీ.. అలాంటిది ఒక లవ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీ గుర్తుకు వచ్చేలా చేస్తుంది.. మరి ఎందుకు ఆలస్యం ఓసారి చదివేద్దాం..
అది 2008-2012 మధ్యకాలం.. మేం ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు.. ఒకే కాలేజ్, నా రోల్ నెంబర్ తర్వాతే అతనిది. నా వెనకాలే కూర్చునే వాడు. అలా కాలేజ్ మొదలైన రోజుల్లో చిన్నగా చూసుకునేవాళ్ళం.. అలా నా పక్కనే ఉంటాడు కదా అతనిపై కాస్త ఆసక్తి పెరిగింది. కానీ బయటకు చెప్పే దాన్ని కాదు.. అతడు ఏరోజైనా కాలేజీకి రాకుంటే నాకు ముందే తెలిసిపోయేది. నా మనసు ఓకే డోర్ వైపే చూస్తూ ఆలోచనలో పడేది..
Advertisement
అలా సాగుతున్న కాలేజ్ లో మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. మేము కాలేజీలో ఐదుగురు ఫ్రెండ్స్ ఒక గ్రూపుల ఉండేవాళ్ళం. కాలేజీకి చేరుకున్నామంటే అయిపోయే వరకు టైమే తెలిసేది కాదు.. అలా గడిచేది.. అలా ఇంజనీరింగ్ పూర్తయింది.. అప్పటికే మా మధ్య ఫ్రెండ్షిప్ పోయి ప్రేమ చిగురించింది.. ఇద్దరికీ ఒకే కంపెనీలో జాబ్స్ వచ్చాయి.. మరింత ఆనందం..!!
జాబ్ లో జాయిన్ అయ్యాం.. తర్వాత కొన్ని రోజులకు మేము పోయిన ఫస్ట్ ట్రిప్ ఇది..
Advertisement
నేపాల్ కులుమనాలి అలా చుట్టేసి వచ్చాం.. మేమిద్దరం కాదండోయ్ మా టీం తో కలిసే వెళ్ళాం..
ఆ ట్రిప్ మా ఇద్దరిని మరింత దగ్గర చేసింది.. ఇక అక్కడే డిసైడ్ అయ్యాం ఇద్దరం ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.. కానీ ఇంట్లో ఒప్పించడం అంత సింపుల్ గా జరగలేదు. చాలా ఇబ్బంది పడ్డాం.. మా రెండు కుటుంబాలు చదువుకున్న వారు కాబట్టి అర్థం చేసుకున్నారు.. మేము ఎంగేజ్మెంట్లో దిగిన ఫోటో 2016..
also read:గుడ్లు, టమాటోలతో కూడా కొడతారు.. రష్మిక పై వస్తున్న ట్రోల్స్ పై సుదీప్
2017 మా పెళ్లి.. చాలా ఏళ్లు నిరీక్షించి సాధించాం.
ఇది ఫోటోగ్రాఫర్ బలవంతం మీద ఇచ్చిన ఫోజ్.. ఎలా ఉంది..?
పెళ్లి తర్వాత మళ్లీ కులుమనాలి ట్రిప్.. జాబ్ లో ఉన్నప్పుడు ఏ ప్లేస్ కి వెళ్ళామో అక్కడీకే మళ్లీ వెళ్లాం.. కానీ ఇద్దరమే..
ఇటీవల మా ఇద్దరి జీవితాల్లోకి ఒక కొత్త వెలుగు మా కొడుకు రూపంలో వచ్చాడు.. ఇంకా ఏముంది అలా మా జీవితాన్ని ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా ఒకరికొకరం అర్థం చేసుకుంటూ గడిపేస్తున్నాం.. ఎలా ఉందండి మా లవ్ స్టోరీ .. కాస్త కామెంట్ పెట్టండి..
also read: