GODFATHER TWITTER REVIEW: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ గాడ్‌ఫాదర్. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్ నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఇవాళ బుధవారం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
‘గాడ్‌ఫాదర్’ కథ కొత్తది ఏం కాదు. మలయాళంలో వచ్చిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమెక్ చేశారు. కథ విషయానికి వస్తే.. సీఎం చనిపోవడంతో ఆయన అల్లుడు పీఠం ఎక్కాలని ప్లాన్ చేస్తుంటారు. సీఎం కొడుకు అజ్ఞాతంలో ఉంటాడు. కానీ తెరవెనుక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాడు. అల్లుడి కుట్రలను ఎలా భగ్నం చేశాడు. తను సీఎం అయ్యాడా లేదా అనేది అసలు కథ.
Advertisement
ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చిరంజీవికి సరిగ్గా సరిపోయిన స్టోరీ అని, తన విశ్వరూపం చూపించారు అని చెబుతున్నారు. సల్మాన్ తన పాత్రని బాగా చేశాడని అంటున్నారు. ఇక అదే సమయంలో కొన్ని నెగటివ్ పోస్ట్‌లు కూడా చేస్తున్నారు. పస్టాప్ పర్వాలేదని, సెకండాఫ్ డౌన్ అయిందని, సినిమా అంతలేదని, సల్మాన్ ఖాన్ ఎపిసోడ్ నిరాశ పరిచిందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ నిరాశ పరిచేవిధంగా ఉందని చెబుతున్నారు. ఫస్టాప్ చాలా గ్రిప్పింగ్‌గా ఉందని.. ఎక్కడ అనవసరమైన సీన్లు లేవని చెబుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు పండుగ చేసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయట.
Advertisement
Also Read : ఎంత పని చేసావు ఉపాసన.. రామ్ చరణ్ కు ఆ అదృష్టం లేనట్టేనా..!!
చిరంజీవి, సత్యదేవ్ ల మధ్య కొనసాగే పొలిటికల్ డ్రామా ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగిందట. మాస్ యాక్షన్ సన్నివేశాలకు సంగీత దర్శకుడు థమన్ బీజీఎం మరో లెవల్ కి తీసుకెళ్లిందట. ఇంటర్వెల్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు. ముఖ్యంగా ఫస్టాప్‌లో 12 నిమిషాల పాటు కొనసాగే ఓ ఫైట్ సీన్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని.. థియేటర్లలో అది ఫైరింగ్ ఎలిమెంట్ అంటున్నారు. క్లైమాక్స్ మాస్ ఎలివేషన్ అదిరిపోయేలా ఉందని టాక్. పవన్ కళ్యాణ్‌కి గబ్బర్ సింగ్ ఎలాగో చిరంజీవికి గాడ్‌ఫాదర్ అలాంటి చిత్రమవుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రీ ఇంటర్వెల్ మాస్ ఫైర్ ని, ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అట. ఓవరాల్‌గా యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి.
Also Read : గాడ్ ఫాదర్ లోని ఆ డైలాగ్ ను చిరంజీవి వైసీపీని ఉద్దేశించి చెప్పారా ..? ఇదిగో క్లారిటీ…!