Home » అమ్మాయిలు.. మీ కాబోయే భర్తతో ఈ విషయాలను పొరపాటున కూడా చెప్పకండి!

అమ్మాయిలు.. మీ కాబోయే భర్తతో ఈ విషయాలను పొరపాటున కూడా చెప్పకండి!

by Srilakshmi Bharathi
Ad

పెళ్ళన్నాక ఏ అమ్మాయికైనా కోటి కలలు ఉంటాయి. అయితే.. కొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా సాధారణం అయిపొయింది. అయితే ఈ క్రమంలో వారిద్దరి మధ్యా చాలా మాటలే దొర్లుతాయి. అయితే.. కొన్నిసార్లు వారిద్దరి మధ్యా ఏ దాపరికాలు ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతో అన్ని విషయాలను చెప్పేసుకుంటూ ఉంటారు.

Advertisement

ముఖ్యం తమ ఫ్యామిలీలో అందరి గురించి, వారి లక్షణాల గురించి.. వారి పెర్సొనల్స్ గురించి కూడా చెప్పేసుకుంటూ ఉంటారు. ఇది నిజానికి మంచిది కాదు. చెప్పుకునేటప్పుడు బానే ఉన్నా.. ఫ్యూచర్ లో గొడవలు వచ్చినప్పుడు ఈ వివరాల వలన గొడవలు మరింత ముదిరే అవకాశం ఉంది.

Advertisement

ఎంతో కట్టుకోబోయే వాడు అయినా.. అమ్మాయిలు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అమ్మాయిలు తమకు కాబోయే భర్తలతో ఎలాంటి విషయాలు చెప్పకూడదు అనేది స్పృహలో ఉండాలి. ముందు మీకు కాబోయే అత్తగారి గురించి ఎక్కడ చెడుగా మాట్లాడకండి. మీ అత్తింటి కుటుంబం గురించి కూడా నెగటివ్ విషయాలను చెప్పుకోవడం కూడా అంత మంచిది కాదు. ఆడపిల్లలు అమ్మానాన్నలను వదిలి దూరంగా వెళ్లారు. కాబట్టి ఇటు పుట్టింటి విషయాలు కానీ, అటు అత్తింటి విషయాలను కానీ ఎక్కడా చెప్పకూడదు.

రెండు కుటుంబాల్లోనూ లోటు పాట్లు ఉండడం సహజం. అయితే.. ఈ విషయాలను ఎక్కడా మాట్లాడకూడదు. ఇంట్లో ఉండే వారి లోపాల గురించి చెప్పుకోవడం వలన గొడవలు వచ్చినప్పుడు వాదనలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక, మీ కాబోయే భర్తతో వారిని కంట్రోల్ చేస్తున్నట్లు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు. మీ మాటే వినాలి, మీ మాటే నెగ్గాలి అన్న ధోరణిలో మాట్లాడకండి. ఏదైనా మితిమీరనంత వరకే బాగుంటుంది. ఓపెన్ మైండ్ తో ఉండడం, వారి అభిప్రాయాన్ని వినడం కూడా అవసరమే.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading