Home » గర్ల్ ఫ్రెండ్ ఓకే.. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో..?

గర్ల్ ఫ్రెండ్ ఓకే.. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో..?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.చిలసౌ, మన్మథుడు2 వంటి సినిమాలకు డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు రాహుల్. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గీతాఆర్ట్స్ సమర్పణలో మాస్ మూవీస్, ధీరజ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్ లో విద్య, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు తెరకెక్కిస్తు మూవీ ది గర్ల్ ఫ్రెండ్. 

Advertisement

ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం లవ్ స్టోరీగా తెరకెక్కనుందని రాహుల్ రవీంద్రన్ చెప్పాడు. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అనౌన్స్ చేస్తూ.. రష్మిక మందన్న ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. నీళ్లలో మొక్కల మధ్య ఉన్న రష్మిక కొత్తగా చూపించాడు దర్శకుడు. అలా చూపించడానికి అర్థం ఏంటో తెలియదు. కానీ రాహుల్ ఈసారి తన దర్శకత్వంపై గట్టిగానే పదును పెట్టాడని తెలుస్తోంది. 

Advertisement

అయితే అనౌన్స్ మెంట్ ఫస్ట్ లుక్ లో రష్మిక ని గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేసిన రాహుల్, ఈ మూవీలో బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పలేదు. అంటే హీరోకి సంబంధించి అనౌన్స్ చేయలేదు. దీనిని బట్టి ఈ మూవీ లేడీ ఓరియెంటేడ్ అని అర్థమవుతుంది. మరీ మేల్ లీడ్ లో ఎవ్వరూ నటిస్తున్నారనేది సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్. ఒకవేళ ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ మెయిన్ లీడ్ గా చేయవచ్చు. మొత్తానికి ఈ చిత్రంలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరికొన్ని సినిమాలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు మనం చూద్దాం.

Visitors Are Also Reading