అలనాటి సినిమాల్లో ప్రేమ కథా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన, మణిరత్నం కథ నుంచి జాలువారిన అద్భుతమైన ప్రేమ కావ్యం గీతాంజలి చిత్రం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా నాగార్జున సినీ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. అలా గీతాంజలి సినిమా ద్వారా మన అందరికీ పరిచయమైన హీరోయిన్ గిరిజ. ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా ఆరు సినిమాలు చేస్తూ వెళ్ళింది. ఈ ఒక్క సినిమాతోనే ఇంత ఇమేజ్ సంపాదించుకుని ఆ తర్వాత ఆరు సినిమాలు చేసి ఇండస్ట్రీని వదిలి కనిపించకుండా పోయింది.
Advertisement
also read:Sr.. NTR జీవితాన్నే మార్చేసిన 5 సినిమాల లిస్ట్..!
Advertisement
మరి అలాంటి గిరిజ.. ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయాలు చూద్దాం.. అలా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయిన గిరిజ లండన్ లో సెట్ అయిపోయింది. 2003లో ఏకంగా ఇంటర్నల్ యోగ ఫిలాసఫీలో డాక్టరేట్ తీసుకుంది. జర్నలిస్టుగా, రైటర్ గా చేస్తోంది. తన జీవితం అంత సాఫీగా సాగుతోంది. కానీ ఐదు పదుల వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో ఆమె తెలియజేసింది.. అదేంటయ్య అంటే.. తన జీవితంలో ఊహించని రెండు సంఘటనలు జరిగాయట.. ఒకటి అనుకోకుండా సినిమా రంగంలోకి రావడం స్టార్ హీరోయిన్ గా మారడం.. రెండవది ఇండియాలోని గుళ్ళు దైవభక్తి తనను చాలా ఆకట్టుకుందట.
అందుకే తన జీవితం మొత్తం ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి నిర్ణయించుకుందట. దీని కోసం ఆమె పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం వెళ్లి అక్కడ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అనే గురూజీనీ కలిసిందట.. అతడు నిస్వార్ధంగా ఎంతోమంది పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారని, అతన్ని చూసి ఇన్స్పయిర్ అయిన గిరిజ తాను కూడా ఎంతో కొంత సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికత వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకుందట. అందుకే 50 సంవత్సరాలు దాటిన గిరిజ పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.
also read: