Home » రెమ్యూనరేషన్ లో తగ్గేదేలే అంటున్న చిరు.. ఎంతో తెలుసా..?

రెమ్యూనరేషన్ లో తగ్గేదేలే అంటున్న చిరు.. ఎంతో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మధ్యతరహా హీరోలలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కష్టపడి స్టార్ హీరోగా మారిపోయాడు.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో, ఎంత సంపాదించినా ఒదిగి ఉండాలనే ఆలోచన కలిగిన మహానుభావుడు.. అందుకే ఆయన మెగా స్టార్ గా పేరు పొందారు.. ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్ సాధించిన మెగాస్టార్ ఆరు పదుల వయసులో కూడా దూసుకుపోతున్నారు.. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకముందు టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోలలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేవారు..

Advertisement

 

also read:స్త్రీలు పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు.. ప్రతి భర్త చూడాల్సిందే..?

Advertisement

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమైన తర్వాత, కొత్త హీరోల హవా పెరిగిపోయింది. వారితో పాటు వారి పారితోషికం కూడా భారీగా పెరిగింది.. ఈ తరుణంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు ఆచార్య సినిమాకు 40 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు.. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీకి 50 కోట్లు పారితోషికం తీసుకొని ఆశ్చర్యాన్ని కలిగించరు.. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటులలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా చిరంజీవి టాప్ లో ఉన్నారు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినా, చిరంజీవి రేంజ్ లో పారితోషికం తీసుకోలేదు. ఆచార్య సినిమా ప్లాప్ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గాడ్ఫాదర్ కేవలం ఆరు రోజుల్లోనే 52 కోట్ల రూపాయల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.. అయితే చిరంజీవి మాత్రం వాల్తేర్ వీరయ్య సినిమాకు తన పారితోషికాన్ని భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

also raed;Sr.. NTR జీవితాన్నే మార్చేసిన 5 సినిమాల లిస్ట్..!

Visitors Are Also Reading