మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత వరస సినిమాలు చేసి బిజీ హీరోగా మారిపోయాడు. గంగోత్రి సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి రాఘవేంద్రరావు ఈ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించాలని అనుకోలేదు. ఈ సినిమా తెరవెనుక చాలా కథ నడిచింది.
Advertisement
ఆ వివరాలను రీసెంట్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మెగా ఫ్యామిలీ నుండి అంతమంది హీరోలుగా పరిచయం అవుతారని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. బయట వాళ్ళ లాగా తమ కుటుంబ సభ్యులు కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పాడు. అంతేకాకుండా చిరంజీవి వల్లే తాను నిర్మాతగా మారానని చెప్పుకొచ్చాడు.
Advertisement
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లలో బన్నీ కూడా ఒకరని నాగబాబు వెల్లడించారు. అయితే బన్నీ మొదటి సినిమా గంగోత్రి ఆఫర్ నిజానికి రామ్ చరణ్ వద్దకు వచ్చిందని తెలిపాడు. గంగోత్రి కోసం మొదట రామ్ చరణ్ ను అడగ్గా చిరంజీవి వద్దని అన్నారని తెలిపారు.
రామ్ చరణ్ కు ఇంకా మెచ్యూరిటీ రావాలని యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలని…. ఆ క్యారెక్టర్ అల్లు అర్జున్ కు బాగుంటుందని చిరంజీవి సూచించారని చెప్పాడు. ఆ విధంగా గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ నటించాడని అన్నారు. ఇక గంగోత్రి సినిమా తరవాత బన్నీ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీ లో స్టార్ గా ఎదిగాడు. అంతే కాకుండా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
Also read : జక్కన్న, అల్లు అరవింద్ కు మధ్య గొడవలు….అందుకే బన్నీని రాజమౌళి పక్కన పెట్టారా?