ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని కనిపించకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతుంటారు. అయితే కామన్ వ్యక్తులకు ఈ లోపం ఉంటే పర్లేదు. కానీ ఎంతో మందిని అలరించే సినిమా స్టార్లకు లోపం ఉంటే చాలా కష్టం. అలా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన ఈ హీరోలకు వివిధ రకాల లోపాలు ఉన్నాయట. వాటిని కనిపించకుండా చాలా కవర్ చేస్తారు.. మరి ఆ లోపాలు ఏంటో, ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
అలనాటి హీరో కత్తి కాంతారావుకు నత్తి సమస్య చాలా ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాక ముందు పెద్దగా ప్రాబ్లం లేదు.కానీ సినిమాల్లోకి వచ్చాక ఇది కుదరదు. అందుకే వద్దంటే డబ్బు చిత్రంలో అక్కినేని తమ్ముడి పాత్రలో ఎంపికైన కాంతారావుకి నత్తి ఉందనే విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ హెచ్ఎం రెడ్డి ఆయనకు వైద్యం చేయించి మెరుగుపరిచారట. ఆ విధంగా నత్తిపోయి జానపద,పౌరాణిక చిత్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరుపొందిన ఆలీకి కూడా నత్తి ఉండేదట.
Advertisement
ఎంతో కృషి చేసి మాటలు బాగా ప్రాక్టీస్ చేసిన తన నత్తి పోగొట్టుకున్నారు. ఇంకా హీరో డాక్టర్ రాజశేఖర్ ఇప్పటికీ మాట్లాడుతుంటే తడబాటు ఉంటుంది. ఒక స్టేజిపై తన నత్తిని ప్రస్తావిస్తూ తాను ఓ దివ్యాంగున్ని అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక మరో స్టార్ హీరో నితిన్.. ఈయనకి కూడా నత్తి ఉంది. అది ఎక్కడ తెలుస్తుందని భయపడేవాడు. మొదట్లో అయినకు శివాజీ డబ్బింగ్ చెప్పేవాడు. అయితే తనకు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఏంటంటని తానే కష్టపడి కృషి చేసి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు నితిన్.
also read: