Home » “దేవర”లో ఎన్టీఆర్ కు అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

“దేవర”లో ఎన్టీఆర్ కు అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

by Mounika
Ad

 టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కొరటాల శివ. కానీ ఆయన స్పీడ్ కు ఆచార్య మూవీ బ్రేక్ వేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కసిగా వర్క్ చేస్తున్నారు. అప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దేవర సినిమా  డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న దేవర చిత్రం   సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

Advertisement

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాలో  “దేవర” అనే హ్యాష్ టాక్ తో  ట్రెండ్ చేస్తున్నారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వికపూర్ నటిస్తుంది. ఇక రెండో హీరోయిన్గా రష్మిక మందన లేక మృణాల్ ని అనుకుంటున్నారట కొరటాల శివ. త్వరలోనే విషయానికి సంబంధించిన  అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది .అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాలో ఓ కీలకమైన క్యారెక్టర్ కి  సంబందించిన విషయం బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ అత్త పాత్ర కోసం ఏకంగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ని కొరటాల శివ సెలెక్ట్ చేశారట.  దేవరలో జూనియర్ ఎన్టీఆర్ అత్త పాత్ర కోసం రమ్యకృష్ణని సంప్రదించడం జరిగిందట.  ఎన్టీఆర్, రమ్యకృష్ణ నా అల్లుడు సినిమా టైంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.  దేవర సినిమాలో కూడా అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారని సమాచారం గట్టిగా వినిపిస్తుంది. ఈ మూవీలో జాన్వికపూర్ కు అమ్మగా  రమ్యకృష్ణ చూడబోతున్నాం అంటూ తెలుస్తుంది. అంతేకాకాకుండా దేవర మూవీలో  ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం మలుపు తిప్పేది రమ్యకృష్ణ పాత్రనే సమాచారం వినిపిస్తుంది.

Visitors Are Also Reading