భారత క్రికెట్లో సచిన్ తరువాత రికార్డులను సాధించిన క్రీడాకారుడు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పవ్చు. టీ-20, వన్డే, టెస్ట్‌లలో ఇలా అన్ని ఫార్మాట్లలో మెరుగైన ఆటను ప్రదర్శించాడు. ఇటీవల తొలుత టీ-20, వన్డే కెప్టెన్సీని నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఆ తరువాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఆటతీరుతో భారత జట్టు కాస్త ఇబ్బంది పడుతున్నదని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ అతడిని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దినదని.. కానీ ప్రస్తుతం అది కోల్పోయాడు అని పేర్కొన్నారు.
Also Read : మైసూర్‌ను కాదని బెంగళూరును కర్నాటక రాజధానిగా ఎందుకు చేశారు?
Advertisement
Advertisement
మొన్న వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ-20లో కోహ్లీ (17) పరుగుల వద్దనే భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో ఫీల్డర్ చేతికి చిక్కిన సంగతి తెలిసినదే. ఆ సమయంలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్తితిలో పడిపోయింది. ఆ షాట్ ఆడినందుకు కోహ్లీ కూడా కాస్త నిరాశ చెందాడు అని చోప్రా పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌తో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై చోప్రా స్పందించారు. విరాట్ కోహ్లీ ఇంతకు ఎప్పుడు అసలు ఇలా రిస్క్ చేసే వాడే కాదు. సిక్సర్ కొట్టే అవసరం లేకపోతే అస్సలు ప్రయత్నించేవాడు కాదు. సంగిల్స్, బౌండరీలతోనే పరుగులు రాబట్టేవాడు. ముఖ్యంగా రిస్క్ తీసుకొని షాట్లు ఎప్పుడూ ఆడేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా ఆడలేకపోతున్నాడని వెల్లడించారు.
కోహ్లీ ఆటతీరు కాస్త ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ ఒకవేళ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్ సిక్సర్‌గా వెళ్లితే ఏమయ్యేదని అడిగితే.. ఏమి కాదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క సిక్సర్‌తోనే మ్యాచ్ గెలిచేది కాదు.. కానీ కానీ కోహ్లీ లాంటి ఆటగాడు కీలక సమయంలో ఔట్ అయితే అది జట్టపై మరింత ప్రభావం చూపుతుందని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గత కొంత కాలంగా కోహ్లీ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అభిమానులు అతని ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
Also Read : చెల్లించని చలాన్లు రూ.600 కోట్లు.. ఇక జరిమానాలో తగ్గింపు : జాయింట్ సీపీ రంగనాథ్