శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. వంటగ్యాస్, నిత్యవసరాలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంధనం కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూ లైన్‌లో గంటల కొద్దీ నిల్చోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆందోళనకు దిగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం పెట్రోలు బంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు తోడుగా సైనిక బలగాలను మోహరింపజేసింది.
Also Read : పుతిన్‌కు భారీ ఎదురు దెబ్బ.. అనతోలి రాజీనామా..!
Advertisement
శ్రీలంకలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావంతో ఆహార సంక్షోభానికి దారి తీసింది. ప్రస్తుతం శ్రీలంకలో చికెన్ రూ.1000, ఒక గుడ్డు ధర రూ.35 దాటిపోయింది. ఏదీ కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో లంకేయులు ఆకలితో అలమటించాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్తితుల్లో లంకలోని తమిళులు శరణార్థులుగా మారి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 మంది శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా తమిళనాడుకు చేరారని తెలుస్తోంది.
Advertisement
కరోనా వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచి శ్రీలంకను కష్టాలు చుట్టు ముట్టాయి. కరోనా కారణంగా దేశానికి పర్యాటకుల రాక కూడా తగ్గింది. విదేశాలలో పని చేసే శ్రీలంక పౌరుల సంఖ్య క్రమేణ తగ్గిపోవడంతో విదేశీ కరెన్సీ నిలువలపై ప్రభావం పడింది. ద్రవ్యోల్భణంతో ప్రజల కొనుగోలు సామర్థ్యం చాలా తగ్గిపోయింది. ఇలా పరిస్థితులు రోజురోజుకు తీవ్రతరం కావడంతో తమిళులు భారత్ వైపు మళ్లుతున్నారు. తమిళనాడు తీరం రామేశ్వరం, ధనుష్కోటిలకు శ్రీలంక తమిళులు వస్తున్నారు. ఇప్పటికే 16 మందిని కోస్ట్‌గార్డ్ అదుపులోకి తీసుకుంది. లంకలో ఆర్థిక ఆహార సంక్షోభం ఇదేవిధంగా కొనసాగితే మరింత మంది లంక తమిళులు భారత్‌కు శరణార్థులుగా వచ్చే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : IPL 2022 : తొలి మ్యాచ్‌లోనే ఆ రెండు టీమ్‌లకు ఎదురు దెబ్బ. ..!