మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇక ఆ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు రవితేజ. వాస్తవానికి ఈ సినిమాను స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలో ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.
Advertisement
Advertisement
ఈ సినిమా ప్రమోషన్స్ పై భారీగా ఖర్చు చేస్తూ, సినిమాపై ఉత్సాహం నింపేందుకు నిర్మాత అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే మేకర్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వీడియోలో ఒక యాంకర్ క్లిప్ కంటెంట్ ను వివరిస్తున్న విషయం వైరల్ అయింది. భారత దేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే కాగా ఇప్పుడు అక్టోబర్ 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదలయ్యే మొదటి ఇండియన్ మూవీగా నిలవనుంది.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ఆ రెండు పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఆర్ మదీ ఐఎస్ పి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ విస్పా డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో విడుదల కానుండగా ఒకరోజు ఆలస్యంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.