Home » ప్రముఖ గాయ‌కుడు కేకే కన్నుమూత.. ప‌లువురు సంతాపం

ప్రముఖ గాయ‌కుడు కేకే కన్నుమూత.. ప‌లువురు సంతాపం

by Anji
Ad

ప్ర‌ముఖ బాలీవుడ్ గాయ‌కుడు కృష్ణ‌కుమార్ కున‌నాత్ (కేకే) హ‌ఠాత్తుగా మ‌ర‌ణించారు. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగ‌ర్ గ‌త మూడు ద‌శాబ్దాల కాలంగా భార‌తీయ సంగీత ప్రియుల‌కు ఎన్నో హిట్‌ల‌ను అందించారు. మంగ‌ళ‌వారం రాత్రి కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ వేడుక‌లో ప్ర‌త్య‌క్షంగా ప్ర‌ద‌ర్శన ఇస్తున్న స‌మ‌యంలోనే ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే అత‌డిని కోల్‌క‌తాలోని సీఎంఆర్ఐ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే కేకే మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ఇక కేకే మ‌ర‌ణించ‌డానికి ముందే తను ప్ర‌ద‌ర్శ‌న పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నేప‌థ్య గాయ‌కునిగా కేకే త‌న‌దైన ముద్ర‌వేసుకున్నారు. హిందీ, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, బెంగాళి త‌దిత‌ర భాష‌ల్లో కూడా ఎన్నో పాట‌లు పాడారు. కేకే మృతితో ఆయ‌న అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు షాక్‌కు గుర‌య్యారు. త‌మ అభిమాన సింగ‌ర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాడ‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.


ప్ర‌ధాని మోడీ, క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌, న‌టుడు అక్ష‌య్‌కుమార్ స‌హ చాలా మంది ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఇక కేకే పాట‌లు అన్ని ర‌కాల భావోద్వేగాల‌ను ప్ర‌తిబింబిస్తాయి. అన్ని వ‌య‌సుల వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఆయ‌న పాడిన పాట‌లతో కేకేను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాం. కేకే కుటుంబ సభ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని.. ఓం శాంతి అని ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

Visitors Are Also Reading