Home » Extra Ordinary Man Review : నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ మూవీ ఎలా ఉందంటే..?

Extra Ordinary Man Review : నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ మూవీ ఎలా ఉందంటే..?

by Anji
Ad

Extra: Ordinary Man Movie Review : టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భీష్మ మూవీ తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ అస్సలు పడటం లేదు. ‘రంగ్ దే’ కొంత వరకు పర్వాలేదనిపించినా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అది యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాచర్ల నియోజకవర్గం సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఏడాది గ్యాప్ తీసుకుని ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నితిన్. తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్   మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా.. ? లేక నిరాశ పరిచిందా అనే విషయాలను  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

extra-ordinary-Review

Advertisement

 

చిత్రం : ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్
నటీనటులు : నితిన్, శ్రీలీల, రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు
దర్శకుడు: వక్కంతం వంశీ
నిర్మాత : శ్రేష్ఠ్ మూవీస్
సంగీతం : హారిస్ జయరాజ్
విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023

Extra Ordinary Man Movie: కథ మరియు వివరణ :

జూనియర్ ఆర్టీస్ట్ గా నితిన్ కనిపిస్తారు. నితిన్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సమాజం తొక్కెస్తుంటుంది. వెనక్కి తొక్కేయడంలో ఎలా ఎదగగలిగాడు..? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇందులో నితిన్  సమస్యలతో చిక్కుకుపోవడం.. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు.  మైసమ్మ రాకతో అతని ప్రయాణం ఎలా మారిందనేది ఈ సినిమా కథ.  ఈ సినిమాలో మైసమ్మ అనే క్యారెక్టర్ మొత్తం కథను నడిపిస్తుంది.  హీరోయిన్ శ్రీలీల పరిచయం కావడానికి  కారణం ఏంటి..?  అనేది తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించాల్సిందే. 

157 నిమిషాల నిడివి గల సినిమాలో ఓ భారీ ఛేజ్ సీక్వెన్స్ తో హీరో నితిన్ తన గడ్డం లుక్ లో ఎంట్రీ ఇస్తాడు. జూనియర్ ఆర్టీస్ట్ గా నితిన్ కనిపిస్తారు. ఈ సినిమా ఫస్ట్ హాప్ సూపర్.. సెకండాఫ్ ను ఫస్టాప్ కి మించి తీయాలనుకున్నారు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. అలా అని సెకండాఫ్ బాగాలేదని కాదు.. సెకండాప్ కూడా అదుర్స్. అక్కడక్కడ కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు.  రష్మికా విజయ్ దేవరకొండ అలాగే పవిత్ర లోకేష్, బాలయ్య సహా కొన్ని సినిమా సాంగ్స్ తో ఓ హిలేరియోస్ ఫన్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతమనే చెప్పవచ్చు.  సెకండ్ హాఫ్ .. కథ వేరే టర్న్ తీసుకుంటుంది.

 

Advertisement

అయితే  హీరో  రాజశేఖర్ అతిథి పాత్రలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి  సినిమాకి హైలెట్ అనే చెప్పాలి.  అప్పటి నుంచి మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ కలుగుతుంది.  రాజశేఖర్ పాత సినిమాలో ఓ పాటతో మంచి ఫన్ జెనరేట్ చేసే సీన్స్ హైలెట్ అనిపిస్తాయి.  ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా.. రోటీన్ స్టోరీ అయినప్పటికీ.. కామెడీ టైమింగ్ తో.. సినిమాను నిలబెట్టారు. మరీ ముఖ్యంగా రావు రమేష్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. సినిమాను నిలబెట్టారంటే కారణం రావు రమేష్ అనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా సూపర్ అనే చెప్పవచ్చు.   సినిమా  నాన్ స్టాప్ నవ్వులను పంచుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకూడదు.. ఫుల్ గా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమాను తప్పకుండా  చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం చూసేయ్యండి.

ప్లస్ పాయింట్స్ :

  • నితిన్
  • రావు రమేష్
  • రాజశేఖర్
  • కామెడీ

మైనస్ పాయింట్స్ :

  • రొటిన్ స్టోరీ
  • విలన్ రోల్
  • శ్రీలీల పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడం

రేటింగ్: 2.75/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading