బిగ్ బాస్ షో కి పలు రివ్యూలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి. ఈయన తన వీడియోలతో సోషల్ మీడియాలోనే కాకుండా బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశాన్ని కూడా అందుకున్నారు. అలా ఈయన బిగ్ బాస్ 6లోకి కంటెస్టెంట్ గా వెళ్లి టాప్ 4 లో కూడా నిలిచారు. అయితే అలాంటి ఆదిరెడ్డి బిగ్ బాస్ 7 పైన కూడా ఎన్నో రివ్యూలు చెప్పారు. అయితే ఆదిరెడ్డి పలు ఇంట్రెస్టెంట్ కామెంట్స్ చేయడంతో అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Advertisement
అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి జరిగిన అన్యాయం గురించి కూడా కొన్ని వీడియోల ద్వారా బయటపెట్టారు. బిగ్ బాస్ షో కి సంబంధించి ఆదిరెడ్డి నెలకు దాదాపు రూ.39 లక్షల వరకు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తానని.. తనకి సంబంధించిన ఆ డబ్బుల లెక్కలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆదిరెడ్డి ఒక పెద్ద ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఆదిరెడ్డి ఒక సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్ని కోట్లున్నా కూడా చెల్లికి మాత్రం అస్సలు పెళ్లి చేయను అంటూ ఆది రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Advertisement
మరి ఆదిరెడ్డి అన్ని కోట్లున్నా కూడా తన చెల్లికి ఎందుకు పెళ్లి చేయడం లేదు..? ఆయన అలా ఎందుకు అన్నారంటే..? ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి కి కళ్ళు కనిపించవనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణంతోనే తన చెల్లికి పెళ్లి చేయను అని ఆదిరెడ్డి చెబుతున్నారు. నా చెల్లికి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా కంటిచూపు రాదని చెప్పారు వైద్యులు. కేవలం 5% మాత్రమే ఆమెకు కళ్ళు కనిపిస్తాయి. అంతేకాదు.. నా చెల్లెలికి సంబంధించిన పనులు మొత్తం నా భార్య దగ్గరుండి చూసుకుంటుంది. ఒకవేళ అత్తింటికి పంపిస్తే నా చెల్లి అత్తింటి వారి వల్ల ఇబ్బందులు పడుతుంది. అందుకే నేను ఆమెకు పెళ్లి చేయను అంటూ ఆది రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్న విషయం తెలిసిందే.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!