Home » ‘మనదేశం’ కంటే ముందే సినిమాల్లో అవకాశం వచ్చినా ఎన్టీఆర్ చేయలేదు.. కారణం ఏంటో తెలుసా ?

‘మనదేశం’ కంటే ముందే సినిమాల్లో అవకాశం వచ్చినా ఎన్టీఆర్ చేయలేదు.. కారణం ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినిమాల కంటే ముందు రోజుల్లో నాటకాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేవి. అందులో రాణించడమే గొప్ప అచీవ్ మెంట్ గా భావించే వారు అప్పటి కళాకారులు. పాతతరం నటీనటులందరూ నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన వారే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు సంపాదించుకున్న నందమూరి తారకరామారావు కూడా నాటక రంగం నుంచి వచ్చిన వారే. ముఖ్యంగా ఎన్టీఆర్ చదువుకునే రోజుల్లో నాటకాల్లో తన ప్రతిభను ప్రదర్శించి అందరిచే శభాష్ అనిపించుకునేవారు.

mana-desam

Advertisement

 

ఆ తరువాత ‘మనదేశం’  సినిమా కంటే ముందే ఎన్టీఆర్ సినిమాల్లోకి రావాల్సింది. కానీ తను తీసుకున్న ఓ నిర్ణయం వల్ల మనదేశం ఫస్ట్ మూవీ అయింది. వాస్తవానికి మనదేశం’  సినిమా కంటే  ముందే ఛాన్స్ వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. సి. పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన వింధ్యరాణి చిత్రంతోనే ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేయాల్సింది.

ntr-and-anr-photos

Advertisement

కానీ తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటించాల్సిందిగా పుల్లయ్య.. ఎన్టీఆర్ ను కోరారు. చదువుకుంటున్న కారణంగా ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్. అప్పటికే ఎన్టీఆర్ డిగ్రీ చదువుతున్నారు. బీ.ఏ.డిగ్రీ చేతిలో ఉంటే తప్ప సినిమాల కోసం ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట.

సినిమా రంగం స్థిరమైంది కాదనే అభిప్రాయం ఆయనకు ఉండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అవ్వకపోతే ఉద్యోగం చేసుకోవచ్చని ముందు జాగ్రత్తగా ఆలోచించారట ఎన్టీఆర్. అందుకే వింధ్యరాణి సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు.

తరువాత సి.పుల్లయ్య మరోసారి తన సినిమా విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ కి ఉత్తరం రాశారు. స్థిరమైన నిర్ణయంతో ఎన్టీఆర్ ఆ ఉత్తరానికి బదులు ఇవ్వలేదు. సినీ రంగం ఎంతో ఇష్టంతో చదువు పూర్తి కాకుండానే ఇంట్లో వారికి చెప్పకుండానే మద్రాస్ రైలు ఎక్కిన వారు చాలా మందే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ఎంతో మందికి ఎన్టీఆర్ ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకోవడం విశేషం.

Also Read :  ఆ సీన్ కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టిన హరికృష్ణ.. అంతటి సాహసం ఎవరు చేయరు..!

Visitors Are Also Reading