సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పేర్కొంటున్నారు నిపుణులు. వైట్ రైస్ తో పోల్చితే బ్రౌన్ రైస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇది పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాస్తవానికి తెల్ల బియ్యంలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
Also Read : ఇండియన్ క్రికెటర్స్ వారి అందమైన భార్యలు!
Advertisement
వైట్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల, బరువు పెరుగుతుంటారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో ప్రయోజనాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. బ్రౌన్ రైస్ దాని బయటి పొట్టును తీసి తయారు చేస్తారు. ఈ బ్రౌన్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలి. బ్రౌన్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. బ్రౌన్ రైస్ తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు కలిగిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల వచ్చే చిక్కులను తగ్గిస్తుంది.
Advertisement
బ్రౌన్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. శరీరంలో చక్కర శోషణ రేటును తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చాలా మంది వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటారు. ఎందుకు అంటే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మానవుల్లో ఆరోగ్యకరమైన ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుది. అధిక యాసిడ్ శోషణను నిరోధిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ చాలా మెరుగుపడుతుంది.