తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో కార్తీక్ ఘట్టమనేని ఒకరు. ఈయన ఇప్పటికే సూర్య వర్సస్ సూర్య అనే సినిమా తీసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం రవితేజతో ‘ఈగల్’ అనే సినిమా చేస్తున్నాడు. చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి మంచి విజయాన్ని అందుకుంటుంది అనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గానే కాకుండా ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్ గా కూడా చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అందులో కార్తికేయ సినిమా కూడా ఉంది.
అయితే కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా ఎందుకు మారాడు అనే విషయం మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తనకి చాలా ఇష్టం అని ఆయన హీరోగానే కాదు, తన దృష్టిలో ఆయన ఒక దేవుడని, అలాగే ఎప్పటికైనా ఆయనతో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన డైరెక్టర్ గా మారినట్టుగా తెలియజేశాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం రవితేజను పెట్టి ఈగల్ అనే సినిమా చేస్తున్నట్టుగా తెలియజేశాడు. ఇక దానితో పాటుగా ఈయన తన తదుపరి సినిమాని కూడా ఒక భారీ హీరోతో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తను అనుకున్నట్టుగా రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు చేస్తారనేది తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement
వాస్తవానికి ఇండస్ట్రీకి ఒక సినిమాటోగ్రాఫర్ గా వచ్చి డైరెక్టర్ గా ఎదగడం అనేది కార్తీక్ ఘట్టమనేని టాలెంట్ ని చూపిస్తుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రవితేజ ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనే దాని మీదనే ఇప్పుడు చాలా రకాలైన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందు యంగ్ డైరెక్టర్ లతో రవితేజ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తరహాలోనే ఇది కూడా సూపర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!