Home » మ‌ల‌యాళ యువ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కు కొవిడ్ పాజిటివ్‌

మ‌ల‌యాళ యువ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కు కొవిడ్ పాజిటివ్‌

by Anji
Ad

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడు.. యువ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కొవిడ్ బారిన ప‌డ్డారు. నాలుగు రోజుల క్రిత‌మే మ‌మ్ముట్టి కూడా త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఇటీవ‌ల రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి చాలా మంది సెలబ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతూ ఉన్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలివుడ్ ఇలా సినీ ఇండ‌స్ట్రీల‌ను క‌రోనా మ‌హమ్మారి ట‌చ్ చేస్తోంది.

Advertisement

Dulquer Salmaan tests positive for COVID-19 | Tamil Movie News - Times of  India

Advertisement

అయితే మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా కొవిడ్ పాజిటివ్ సోకింద‌ని వెల్ల‌డించారు. తాను కొద్ది రోజుల నుంచి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అనుమానం వ‌చ్చి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ తేలింద‌ని.. న‌న్ను కాంటాక్టు అయిన వారందూ ప‌రీక్ష‌లు చేయించుకోండ‌ని సూచించారు. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్న దుల్క‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

Visitors Are Also Reading