చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ దిగ్గజనటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొందరు మరణిస్తే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కాలం చేశారు. చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో శ్రీనివాసమూర్తి చనిపోయారు. ఆయన తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలుఅందిస్తున్నారు.
READ ALSO : Senior Actress Jamuna: టాలీవుడ్ లో మరో విషాదం..సీనియర్ నటి జమున కన్నుమూత
Advertisement
ఆయన తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఓ ప్రముఖ టీవీ చేసిన ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూతో శ్రీనివాసమూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది.శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు, పెద్దపెద్ద స్టార్లకు తన గాత్రాన్ని అందించారు. ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల అభిమానులు, తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
శ్రీనివాసమూర్తి లాంటి ఒక గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి దొరకడం చాలా కష్టం అంటూ అభిప్రాయపడుతున్నారు. మీరు తెలుగులో చూసిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పారు. కొన్నేళ్లుగా మోస్ట్ సక్సెస్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. విక్రమ్, అపరిచితుడు, సూర్య, సింగం సిరీస్, 24, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు అలా వైకుంఠపురంలో జయరాం సుబ్రహ్మణియన్, రాజశేఖర్ కు ఇలా ఎన్నో గొప్ప చిత్రాలు, ఎందరో స్టార్ హీరోలకు శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పారు.
READ ALSO : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు